కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ముఖ్యమైనది
హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రావు
కరీంనగర్ :

రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యవర్తిత్వం యొక్క భావన, పద్ధతులపై ఎంపానెల్డ్ న్యాయవాదులకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, గవర్నర్ల బోర్డు, మధ్యవర్తిత్వం, మధ్యవర్తిత్వ కేంద్రం హైదరాబాద్ సభ్యులు జే. శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో కేసులు పరిష్కరించవచ్చునని, న్యాయస్థానాల పై భారం తగ్గుతుందని కక్షిదారులకు డబ్బు మిగులుతుందని తెలియజేశారు, ఒకవేళ మధ్యవర్తిత్వం ద్వారా కేసు పరిష్కారం అయితే కక్షిదారులు న్యాయస్థానాలు ,న్యాయవాదులు సంతోషపడాల్సిన సందర్భమని, కక్షిదారులకి మధ్యవర్తిత్వంపై నమ్మకం పెరుగుతుందని తెలియజేశారు, ఈ సందర్భంగా న్యాయమూర్తులు కక్షిదారులకు మధ్యవర్తిత్వం గురించి తెలియజేసి తమ యొక్క సమస్యను పరిష్కరించుకొనుటకు మధ్యవర్తిత్వాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలని తెలియజేశారు ఒకవేళ మధ్యవర్తిత్వం ద్వారా తమ కేసు పరిష్కారము కాకపోయినప్పుడు తిరిగి చట్ట ప్రకారము న్యాయస్థానము ఆ కేసును పరిష్కరించుకొని పరిష్కరిస్తుందని తెలియజేశారు. శిక్షణ పొందిన న్యాయవాదులు మధ్యవర్తిత్వము ద్వారా కేసును విజయవంతంగా పరిష్కరించాలని కోరారు, ఇట్టి సందర్భంగా శిక్షణ పొందిన న్యాయవాదులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు, ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మెంబర్ సెక్రెటరీ సిహెచ్ పంచాక్షరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే శివకుమార్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్ మరియు జిల్లా న్యాయమూర్తులు జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు.
