తెలంగాణకు నిధులు తీసుకురాలేని బిజెపి ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి: నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్, కోమటిరెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి, అన్యాయం చేయడం తగదని పీసీసీ పిలుపుమేరకు సోమవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా లోనీ అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సుడ ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని, కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో సంవత్సరానికి 26 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తుంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చిల్లు రూపాయి ఇవ్వకపోవడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంపై బిజెపి ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయో అక్కడ అధిక నిధులు కేటాయించి తెలంగాణపై వివక్ష చుపారని గుర్తుచేశారు. ఈ వైఖరిని జిల్లా కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగు బిడ్డ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనిషిలో అని తెలుగులో పద్యం ప్రారంభిస్తే తెలుగు ప్రజల మీద ప్రేమ చూపిస్తారని అనుకున్నామని సంతోషం ఉండేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇస్తారని భావించాం, ఎన్ డి ఏ కు మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వకుండా అన్యాయం చేశారని తెలిపారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎట్టి పరిస్థితులను బిజెపి పార్టీని ఆ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆరోపించారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రిగా ఉండి కరీంనగర్ లోక్ సభ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుండి నిధులు తీసుకురాకపోవడానికి చేతకానితనానికి నిదర్శనంగా బిజెపి పార్టీని ఎంపినీ తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టడం ఖాయమని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ రాష్ట్రంలో గెలుపొందిన బిజెపి ఎంపీలు ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాం, తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు వారికి ఉండదని తెలుసుకోవాలనీ, బిజెపి నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండి తాజ్, బానోతు శ్రవణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, పులి ఆంజనేయులు గౌడ్, పురం రాజేశం, కాంగ్రెస్ నాయకులు, ఆకారపు భాస్కర్ రెడ్డి జిల్లాలోని బ్లాక్ మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి):
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి, అన్యాయం చేయడం తగదని పీసీసీ పిలుపుమేరకు సోమవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా లోనీ అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సుడ ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని, కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో సంవత్సరానికి 26 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తుంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చిల్లు రూపాయి ఇవ్వకపోవడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంపై బిజెపి ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు.
దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయో అక్కడ అధిక నిధులు కేటాయించి తెలంగాణపై వివక్ష చుపారని గుర్తుచేశారు. ఈ వైఖరిని జిల్లా కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
తెలుగు బిడ్డ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనిషిలో అని తెలుగులో పద్యం ప్రారంభిస్తే తెలుగు ప్రజల మీద ప్రేమ చూపిస్తారని అనుకున్నామని సంతోషం ఉండేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇస్తారని భావించాం, ఎన్ డి ఏ కు మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వకుండా అన్యాయం చేశారని తెలిపారు.
ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎట్టి పరిస్థితులను బిజెపి పార్టీని ఆ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆరోపించారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రిగా ఉండి కరీంనగర్ లోక్ సభ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుండి నిధులు తీసుకురాకపోవడానికి చేతకానితనానికి నిదర్శనంగా బిజెపి పార్టీని ఎంపినీ తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టడం ఖాయమని హెచ్చరించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ రాష్ట్రంలో గెలుపొందిన బిజెపి ఎంపీలు ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాం, తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు వారికి ఉండదని తెలుసుకోవాలనీ, బిజెపి నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండి తాజ్, బానోతు శ్రవణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, పులి ఆంజనేయులు గౌడ్, పురం రాజేశం, కాంగ్రెస్ నాయకులు, ఆకారపు భాస్కర్ రెడ్డి జిల్లాలోని బ్లాక్ మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
