స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ సత్తా చాటాలి
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 19: సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యచరణ కార్యక్రమంలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి చిన్నమైల్, జాతీయ కిసాన్ మోర్చ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ సత్తా చాటాలని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకోవాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా , మండల నాయకులు పాల్గొన్నారు.
About The Author
03 Aug 2025