విద్య, వైద్యం ,సామాజిక భద్రత, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం :మంత్రి దామోదర రాజనర్సింహ 

విద్య, వైద్యం ,సామాజిక భద్రత, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం :మంత్రి దామోదర రాజనర్సింహ 

సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, జూలై 23: స్వయం సహాయక సంఘం మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం పుల్కల్ మండలం సింగూరు చౌరస్తాలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన అందోల్ నియోజకవర్గం మహిళా శక్తి సంబరాలకు టీజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు.

చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు నూతన వ్యాపార అవకాశాలను కల్పిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే మొదటి మహిళా శక్తి పెట్రోల్ పంపులు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పెట్రోల్ పంపు విజయవంతంగా నడుస్తున్నట్లు ప్రతిరోజు ఐదు నుండి ఆరు లక్షల టర్నోవర్ సాధించడంతోపాటు 16 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ పెట్రోల్ పంపు ద్వారా వివిధ రకాలుగా ఉపాధి పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా మహిళా క్యాబ్ డ్రైవర్లుగా 50 మంది మహిళలకు శిక్షణ కార్యక్రమం జిల్లాలో పూర్తి చేసినట్లు తెలిపారు వీరందరికీ త్వరలో రాయితీపై కార్లు ఇప్పించేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మెప్మా అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వీటితోపాటు వ్యవసాయ రంగంలో పురుగుమందుల పిచికారి కోసం డ్రోన్ వినియోగంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు . డ్రోన్ కొనుగోలు కోసం రూ.8 లక్షల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయతీరుణం అందజేసి రోడ్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

Read More నిజాయితీని నిర్బంధిస్తున్న డిప్యూటీ కమిషనర్...

ఈ సందర్భంగా అందోల్ నియోజకవర్గం పరిధిలోని 9 మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీ రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా గడిచిన సంవత్సర కాలంలో 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడం ద్వారా రూ .6680 కోట్ల రూపాయల లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు. విద్య, వైద్యం ,సామాజిక భద్రత, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు .

Read More కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష..

ఈ సందర్భంగా బ్యాంక్ లింకేజీ రుణాలు ₹53.92 కోట్లు (516 సంఘాలకు),వడ్డీ లేని రుణాలు: ₹10.38 కోట్లు (4538 సంఘాలకు),భీమా పరిహారాలు: ₹51.30 లక్షలు (మొత్తం 32 సభ్యులకు),మొత్తం ఆస్తుల విలువ: ₹64.81 కోట్లు చెక్కులు అందజేశారు. అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ,డిఆర్డిఓ జ్యోతి , ఆర్ డి ఓ పాండు , ప్రజాప్రతినిధులు ,ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని 9 మండలాల చెందిన మండల మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ సమైక్య సభ్యులు పాల్గొన్నారు.

Read More మాతా శిశు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

About The Author