అక్షర మహిళ మండలి సభ్యులపై మెండుగా ఫైర్ బ్రాండ్ అశీస్సులు..
తెలంగాణ రాష్ట్ర పంచాయత్ పరిషత్ లో వరించిన పదవులు -కృతజ్ఞతలు తెలిపిన రేణుక అక్షర మహిళ మండలి
మణుగూరు, జూలై 22 (భారతశక్తి) : పట్టణంలో స్థానికంగా రాజ్యసభ సభ్యురాలు ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి పేరుతో అంబేద్కర్ సెంటర్లలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గురిజాల గోపి ఆధ్వర్యంలో కొంతమంది మహిళలు గ్రూప్ గా ఏర్పడి రేణుక అక్షర మహిళ మండలి సంస్థను స్థాపించారు. ఈ మహిళలురే ణుక క్యాంపు కార్యాలయం నుండి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కష్టపడ్డ వారికే పదవులు వరిస్తాయని నానుడిచెప్పిన సూక్తి. అందుకే అక్షర మహిళ మండలి సభ్యులకు గురిజాల గోపి సారథ్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర పంచాయత్ పరిషత్ లో పినపాక నియోజకవర్గ పదవులు వరించాయి. తెలంగాణ రాష్ట్ర పంచాయత్ పరిషత్ మహిళ విభాగంలో పినపాక నియోజకవర్గ కన్వీనర్ గా అత్తర్హునిషా, కో- కన్వీనర్ గా కె వసంత, మణుగూరు మండలం కన్వీనర్ గా పూనెం సరోజ, కో- కన్వీనర్ గా బొడ్డు సుజాత గా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర పంచాయత్ పరిషత్ చైర్మన్ ఎమ్.ఏ జలీల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ సందర్భంగా నూతన భాద్యతలు స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర పంచాయత్ పరిషత్ మహిళ నాయకురాలు రేణుక క్యాంపు కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గురిజాల గోపి మహిళలకు నియామక పత్రం అందించి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్ఫ గుచ్చాలు అందించి శాలువాతో సత్కరించి స్వీట్లు తినిపించారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ మాపై నమ్మకంతో బరువు బాధ్యతలు అప్పగించిన నేతలకు, పదవులు వచ్చే విధంగా కృషి చేసిన ఫైర్ బ్రాండ్ రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, చైర్మన్ జలీల్, జిల్లా కాంగ్రెస్ నేత గురిజాల గోపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి మహిళా సీనియర్ నాయకులు కోరి శ్యామల సెక్రటరీ రెడ్డి బోయిన రేణుక, నాంపల్లి రమణ, డేరంగుల సుజాత, భవాని, పుష్ప తదితరులు పాల్గొన్నారు.