విద్యార్థులు విద్యావకాశాలలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మెరుగైన విద్య సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి

రఘునాధపాలెం మండలం వి. వెంకటాయపాలెం ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులు విద్యావకాశాలలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూలై 22: విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోని, లక్ష్య సాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

పాఠశాలలోని వంట షెడ్, వండుతున్న మధ్యాహ్న బోజనం, కూరలు, అన్నం, సాంబారు నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు రోజువారి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని వంట సిబ్బందికి సూచించారు. పాఠశాలలోని పలు అంశాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

Read More సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రణాళికలు..

IMG-20250722-WA4026

Read More ఆధునిక పరిజ్ఞానముతో వీణా కంటి హాస్పిటల్లో నేత్ర వైద్య పరీక్షలు..

ముందుగా పాఠశాలలో తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. స్కూల్ యూనిపామ్, పాఠ్య పుస్తకాలు, నోట్స్ బుక్స్ అన్ని వచ్చాయా, విద్యా బోధన ఎలా ఉంది, రోజు మంచిగా మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీసారు. విద్యార్థులతో ఇంగ్లీషు అక్షరాలు, పదాలు చదివించారు. అపై తొమ్మిదవ తరగతి విద్యార్థులకు టీచర్ లాగా కలెక్టర్ బోర్డు పై లెక్కలు వ్రాసి గణితం పాఠాలు బోధించారు. పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు అడిగి, విద్యార్థుల విషయావగాహన పరీక్షించారు.

Read More రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన హోంగార్డు కు 15 లక్షల భీమా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ... జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేలా లక్ష్యాలను పెట్టుకోవాలని, భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు కృషి చేయాలని అన్నారు.  

Read More  నడిచే దేవుళ్ళు డాక్టర్లు!

విద్యార్థులు ప్రతిరోజు తప్పనిసరిగా బట్టిపట్టకుండా అర్ధం చేసుకొని చదువాలని సూచించారు. సైకిల్ నేర్చుకోవడం కోసం పడుతూ లేస్తూ ఎలాగైతే ప్రయత్నిస్తామో, అదే విధంగా విద్య పట్ల అనుమానాలు నివృత్తి చేసుకుంటూ మంచిగా చదువుకోవాలన్నారు. విద్యలో రెగ్యులర్ గా మనం వృద్ధిని సాధించాల్సి ఉంటుందని, మనతో మనం పోటీపడుతూ మన ఉన్నతికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. మనం చేయగలం అనే ధైర్యం ఉండాలని, ఇదే మనలను ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.

Read More కాకతీయ గడ్డ నుండే బీసీల రిజర్వేషన్ల ఉద్యమం

అనంతరం పాఠశాల అంతా కలియ తిరిగి కావాల్సిన సదుపాయాలు ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న రెండు టాయిలెట్స్, విశాలంగా ఉన్న గ్రౌండ్, నూతనంగా మంజూరు అయిన బీసీ హాస్టల్ నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయు శ్రీమన్నారాయణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ హనుమంతరావు అధికారులు, తదితరులు ఉన్నారు.

Read More జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే పెద్దమ్మ గుడి కూల్చివేత

About The Author