ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 23: హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ శ్రీ ఆది వరాహలక్ష్మి నరసింహ వేణుగోపాల స్వామి దివ్య క్షేత్రములో క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము, 108 తమల పాకులచే ఆకుపూజ,గంధ సింధూరము, పానకం, వడపప్పు, పండ్లు, నారికేళము, పులిహోర, వడమాల,ప్రసాద నివేదనలతో పూలదండ అలంకరణ సహిత పూజా కార్యక్రమమును గింజల నరేందర్ రెడ్డి వాసంతి దంపతులు, పురం నాగరాజు లు చేయించారు.
ఈ కార్యక్రమంలోఆలయ చైర్మన్ యరగాని గురవయ్య,ధర్మకర్తలు గంధం అంజయ్య,తిపిరిశెట్టి హరీష్ కుమార్, వేముల నరసింహారావు కోలా కృష్ణ ప్రసాద్,పెనుబేల్లి హనుమంతరావు, మేరిగా కవిత, మరియు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎంపీ లక్ష్మణ రావు, ఆలయ అర్చకులు ముడుంబై హరీష్ కుమారా చార్యులు,పి శ్రీనివాసచార్యులు మరియు సురభి సైదులు,చిన్ను శ్రీనివాసరెడ్డి,సారెడ్డి వీరారెడ్డి,నీలా సాయికుమార్,పేరబోయిన వీరయ్య, గార్లపాటి భరత్ చంద్ర, ఊటుకూరి బోనచంద్ర,వాసంతి,వీణ,విజయలక్ష్మి, సాయి ప్రసన్న, యామిని,సరస్వతి, మరియు ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.