హలో మాదిగ.. ఈ నెల 25న ఛలో గోదావరిఖని.! 

కొత్తగూడెం రిజియన్ ఇంచార్జీ కాజీపేట కృష్ణ

హలో మాదిగ.. ఈ నెల 25న ఛలో గోదావరిఖని.! 

మణుగూరు, జూలై 23 (భారతశక్తి): ఈ నెల 25న గోదావరిఖనిలోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ కి సింగరేణి మాదిగ ఎంప్లాయిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరుగుతుందని, పెద్ద ఎత్తున మాదిగ అనుబంధ సంఘాల నేతలు తరలి రావాలని కొత్తగూడెం రిజియన్ ఇంచార్జీ కాజీపేట కృష్ణ బుధవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మ శ్రీ అవార్డు గ్రహీత దళితుల ఆరాధ్యదైవం మైన మంద కృష్ణ మాదిగ రెండు దశాబ్దాల క్రితమే సింగరేణిలో పర్యటించి మాదిగ ఎంప్లాయిస్ ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారని పేర్కొన్నారు. సింగరేణిలో కూడా మాదిగ ఎంప్లాయిస్ స్థాపనకు మంద కృష్ణ ఆదేశానుసారమే అసోసియేషన్ స్థాపించడం జరిగిందని తెలిపారు.

మాదిగ ఉద్యోగులకు సింగరేణిలో కొండంత అండగా నిలిచి నేనున్నానంటూ బెల్లంపల్లి నుండి కొత్తగూడెం వరకు భరోసా యాత్రను సాగించిన మాన్యులు మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా భారీ సన్మాన సభ ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు ఆర్కే గార్డెన్స్ లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చొప్పదండి దుర్గప్రసాద్, అధ్యక్షులు బొంకూరి మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతుందని కొత్తగూడెం రీజియన్ ఇంచార్జ్ కాజీపేట కృష్ణ వెల్లడించారు. ఈ భారీ సన్మాన బహిరంగ సభ కు మాదిగ అనుబంధ సంఘాల నాయకులు, మాదిగ సింగరేణి ఎంప్లాయిస్, పదవి విరమణ పొందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Read More జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే పెద్దమ్మ గుడి కూల్చివేత

About The Author