
వేములవాడ : వేములవాడ పట్టణంలోని ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిప్పాపూర్ లోని అర్ఫా ఇ మజీద్ వద్ద ముస్లిం పట్టణ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.దేశ భక్తితో బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ నినాదాలు చేశారు. ఆనంతరం మహమ్మద్ అక్రమ్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే నేటి స్వతంత్ర దినోత్సవమని కొనియాడారు.దేశం కోసం పోరాడిన ఎందరో మహనీయుల త్యాగాలను గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లకు ఘనంగా నివాళులర్పించారు. మన భారత దేశం కోసం పోరాడి అమరులైన భారత అమరవీరులను స్మరించుకోవడం మన అందరి బాధ్యతని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.