ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఎగరేసిన మల్ రెడ్డి రాంరెడ్డి

ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఎగరేసిన మల్ రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్, ఆగష్టు 15 (భారత శక్తి): భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం డివిజన్ దిల్సుఖ్ నగర్ లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రోడ్ డెవలప్‌‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి..భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని గడ్డిఅన్నారం ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లలితా నగర్ కాలనీలో ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మల్‌రెడ్డి రాంరెడ్డి చొరవతో మెట్రో కింద ఇనుప రేలింగ్ తొలగించడంతో లలితా నగర్ కి మార్గం సులభమైందని, తద్వారా గడ్డిఅన్నారం ట్రేడ్ అసోసియేషన్ కి వ్యాపార కష్టాలు తీరాయన్నారు. ఇలాంటి నాయకులు అధికారంలో ఉంటేనే మాలాంటి సామాన్య ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది పూర్తిగా ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు వారి సమస్యలు పరిష్కరించడమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. రహదారుల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుందని తెలిపారు.ఆర్ అండ్ బి శాఖ రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రచించి, అమలు చేస్తున్నదని తెలిపారు.

About The Author