ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి కొండా సురేఖ

ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఆగష్టు15:79 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హనుమకొండ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం పరేడ్ వాహనంలో మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ లకు వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, కవులు, కళాకారులకు మంత్రి సురేఖ 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర వివరాల నివేదికను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చదివారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు దేశభక్తి గీతాలకు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో జిల్లా టాపర్లుగా నిలిచిన పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులకు పదివేల చొప్పున ఎనిమిది మంది విద్యార్థులకు 80 వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా విద్యాశాఖ అధికారులు అందజేశారు. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం తో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. 

Read More నేటి స్వాతంత్య్ర సంబురం, వెలకట్టలేని వీరుల పోరాటాల ఫలితం

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఉత్తమ పనితీరుకుగాను ప్రశంసా పత్రాలను మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అందజేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళలు పిల్లలు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, తెలంగాణ చేనేత- టెస్కో, వ్యవసాయ, గృహ నిర్మాణ, మత్స్య, జిల్లా వైద్య ఆరోగ్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

Read More ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పలు వ్యవసాయ పరికరాలను ప్రదర్శించగా మంత్రి, కలెక్టర్, సిపి, వాటిని తిలకించారు. మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన విదేశీ విద్య నిధి పథకం కింద ముగ్గురు విద్యార్థులకు విదేశీ విద్య, విమానయాన ఖర్చులు సహా రూ. 61.71 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యావరణ, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఘనంగా స్వాగతం పలికారు. 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, డిసిపి షేక్ సలీమా, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, ఇతర అధికారులు, జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

IMG-20250815-WA0112

Read More హత్యాయత్నం కేసులో నిందుతులకు ఐదేళ్లు జైలు

About The Author