దేశ సేవకు పునరంకితం కావాలి
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
- జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (భారత శక్తి ) : దేశ సేవకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు, ఆర్.ఐలు, ఎస్.ఐ లు, పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.