వేములవాడ ప్రెస్ క్లబ్ నుండి ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సహాయం

వేములవాడ ప్రెస్ క్లబ్ నుండి ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సహాయం
వేములవాడ, ఆగస్టు 15 (భారత శక్తి) : వేములవాడ పట్టణానికి చెందిన, సిరిసిల్లలో టీవీ9 రిపోర్టర్‌గా విధులు నిర్వహించిన గర్దాస్ ప్రసాద్ గుండెపోటుతో ఇటీవల అకాల మరణం చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రసాద్ కుటుంబానికి రూ.44 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సహాయాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు రఫీక్ మాట్లాడుతూ ఆపద సమయంలో తోటి జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలబడటం ప్రతి జర్నలిస్టు బాధ్యత అని పేర్కొన్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు జర్నలిస్టులందరూ సమైక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు భాస్కర్ రెడ్డి పాశం, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అలీ, ప్రధాన కార్యదర్శి జితేందర్, విష్ణు, రియాజ్‌తో పాటు పలు జర్నలిస్టులు పాల్గొన్నారు.

About The Author