స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఉద్యోగులు పనిచేయాలి
జిల్లా కలెక్టర్ పి .ప్రావిణ్య
సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 15 :స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ , మాధురి లతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని ఉద్యోగులను నిర్దేశించి కలెక్టర్ మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఉద్యోగులు తమ విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతం కోసం ప్రతి ఉద్యోగి పని చేయాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, తదితర కార్యక్రమాల విజయవంతం అధికారులు సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లాలి అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో జిల్లాలో మెరుగైన ఫలితాల సాధన కోసం అధికారులు సిబ్బంది పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.