కలెక్టరేట్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆగస్టు 15 : కలెక్టరేట్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కు అధికారులు పూల మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ గీతాలాపన, తెలంగాణ రాష్ట్ర గీతాలాపన చేసిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి వివరాలను ఆయన కూలంకషంగా వివరించారు. అధికారుల పనితీరుతో జిల్లా అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలుస్తుందని చెప్పారు. జిల్లా అధికారులు సిబ్బంది మరింత ఉత్సాహంతో పని చేస్తూ, జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేయాలని అన్నారు.
వేడుకల్లో భాగంగా పాఠశాలల విద్యార్థులచే దేశభక్తి ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నా. ఫైనాన్స్ కమిషనర్ కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన పలువురు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలబాలికలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. జిల్లా ప్రణాళిక శాఖ, జిల్లా పౌర సమాచార శాఖ ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి మాసపత్రికను విడుదల చేశారు.విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలోని పలు శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించారు. పలువురు పోలీసులకు సేవా పతకాలను అందజేశారు.
అవార్డులు ఉత్తమ పనితీరుకు నిదర్శనమని, అవార్డులు లభించిన అధికారులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని అన్నారు. పలువురు దివ్యాంగులకు ఉపకరణాలను అందించారు. కలెక్టరేట్ ఆవరణలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, అవినాష్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.