సీఐ. బి.వీరప్రసాద్‌కు ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకం
వేములవాడ, ఆగస్టు 15 (భారత శక్తి) : పోలీస్ శాఖలో అంకితభావంతో విశేష సేవలందించిన వేములవాడ పట్టణ సీఐ బి.వీరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకానికి ఎంపికయ్యారు. శుక్రవారం 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖలో విశేషమైన సేవలు సేవలు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాష్టకమైన పోలీస్ సేవ పథకాలను జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే సంయుక్తంగా ప్రశంస పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రజా భద్రత, శాంతి భద్రత పరిరక్షణలో ఆయన కృషి అభినందనీయమని పలువురు కొనియాడారు. సేవా భావంతో తన కర్తవ్యాన్ని విధిగా నిర్వర్తించడం వలన ప్రభుత్వ విప్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకోవడం మరింత ఉత్తేజాన్ని కలిగించిందని పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు.