గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ రెండు గేట్ల ఎత్తి వేత, నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే.
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆగస్టు 15 (భారత శక్తి): మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో రెండు గేట్లను ఎత్తివేశారు. ఎమ్మెల్యే పవా ర్ రామారావు పటేల్ స్విచ్ నొక్కి గేట్లు ఎత్తివేసి సుద్ద వాగు లోకి నీటిని వదిలారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 15 వేల క్యూసెక్కుల నీరు రాగా, 5 వేల క్యూసెక్కుల నీటిని సుద్దా వాగులోకి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ వాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. ప్రాజెక్టు నిండడం సంతోషకరమన్నారు.