ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

  • 16 వేల 153 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
  • జిల్లాలో నూతనంగా 24 వేల 818 కుటుంబాలకు రేషన్ కార్డ్ లు జారీ

ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), ఆగష్టు 15:ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. శుక్రవారం ఉదయం ముఖ్య అతిథి పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ముఖ్య అతిథి తన సందేశాన్ని తెలియజేసారు. 

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసిందని, స్వాతంత్ర్యం తరువాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికామని అన్నారు. 

Read More రోడ్డుపై చిరు వ్యాపారుడి దేశభక్తి, ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

70 ఏళ్ళుగా పి.డి.ఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుందని, అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందని అన్నారు. పేదల ఆత్మగౌరవానికి మరో ప్రతీక రేషన్ కార్డులను అర్హులైన పేద కుటుంబాలు అందరికీ పంపిణీ చేస్తున్నామని, ఖమ్మం జిల్లాలో నూతనంగా 24 వేల 818 కుటుంబాలకు రేషన్ కార్డ్ లు జారీ చేశామని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కల్పించిందని,ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేసామని అన్నారు. రైతులకు అందించే పెట్టుబడి సహాయాన్ని 12 వేల రూపాయ లకు పెంచి, వానాకాలం పంటకు ఖమ్మం జిల్లాలో 3,37,898 మంది రైతుల ఖాతాలో 427 కోట్ల 38 లక్షల రూపాయలు రైతు భరోసా నిధులు జమ చేసామని డిప్యూటీ సీఎం అన్నారు.

Read More భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

IMG-20250815-WA0146

Read More మహిళను కాపాడిన లేక్ పోలీసులు

యాసంగి సీజన్ లో 34 వేల 305 మంది రైతుల వద్ద నుండి రూ.545 కోట్ల విలువ గల 23 లక్షల 60 వేల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసి 48 గంటలలోగా చెల్లింపులు చేసామని తెలిపారు. మద్దుల పల్లిలో 19 కోట్ల 95 లక్షల రూపాయలు ఖర్చు చేసి నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేశామని, ఖమ్మంలో 155 కోట్లతో మోడల్ మిర్చి మార్కెట్ నిర్మిస్తున్నామని అన్నారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశ పెట్టిందని, ఖమ్మం జిల్లాలో 16 వేల 153 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, ఇంటి నిర్మాణ పురోగతి ప్రకారం నాలుగు దశలలో గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా 5 లక్షల రూపాయలు జమ చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన పేదలకు పారదర్శకంగా అందజేస్తున్నామని అన్నారు. 

Read More సీఐ. బి.వీరప్రసాద్‌కు ప్రతిష్టాత్మక పోలీస్‌ సేవా పతకం

ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందనీ, మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, నేటి వరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు 4 కోట్ల 22 లక్షల 98 వేల 507 ఉచిత బస్సు ప్రయాణాలు చేయడం వల్ల 198 కోట్ల 34 లక్షల 49 వేల రూపాయలను ఆదా చేశారని అన్నారు. మహాలక్ష్మి పథకం క్రింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని, దీని ద్వారా జిల్లాలో 2 లక్షల 29 వేల 34 కుటుంబాలు లబ్ది పొందినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం క్రింద జిల్లాలో 150 కోట్ల రూపాయల సబ్సీడి చెల్లించి 2 లక్షల 48 వేల 995 కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. 
 
అత్యవసర పరిస్థితుల కోసం విద్యుత్ అంబులెన్స్ లను డివిజన్లలోఅందుబాటులో ఉంచామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద ఎర్రుపాలెం మండలం రాజుల పాలెం గ్రామం, కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రణాళికలు చేపట్టాం. బోనకల్ మండలంలోని 22 గ్రామాలను సోలార్ విద్యుత్ సరఫరా చేసి సోలార్ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇందిరా సౌర గిరి జల వికాస పథకం క్రింద జిల్లాలో రాబోయే 3 సంవత్సరాలలో జిల్లాలోని 11 వేల 785 రైతులకు చెందిన 27 వేల 447 ఎకరాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.

Read More శ్రావణమాసం బోనమెత్తిన శివసత్తులు

నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే రాజీవ్ ఆరోగ్య శ్రీ క్రింద 35 వేల 645 మందికి 93 కోట్ల 50 లక్షల 82 వేల 840 రూపాయల వైద్య ఖర్చులను ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. మధిర, సత్తుపల్లి పట్టణాలలో 34 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ 100 పడకల ఆసుపత్రులు, కల్లూరులో 10 కోట్ల 50 లక్షలతో 50 పడకల కమ్యూనిటి హెల్త్ సెంటర్, పెనుబల్లి నందు 7 కోట్ల 50 లక్షలతో 30 పడకల కమ్యూనిటి సెంటర్ నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. పాలేరు, సత్తుపల్లి పట్టణాల్లో 25 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, వైరా పట్టణంలో 37 కోట్ల 50 లక్షలు ఖర్చు చేస్తూ 100 పడకల ఆసుపత్రి భవనం, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నందు 23 కోట్ల 50 లక్షలతో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు.

Read More నేటి స్వాతంత్య్ర సంబురం, వెలకట్టలేని వీరుల పోరాటాల ఫలితం

యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నామని, బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించామని, 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు.  తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోమని, శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మధిర ప్రాంతంలో ఎర్రుపాలెం, మధిర మండలాల్లో నాగార్జున సాగర్ జోన్ 3 లోని 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 3 లక్షల 28 వేల 853 ఎకరాలలో కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పించబడుతుందని అన్నారు. రఘునాథపాలెం మండలంలో మంచు కొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 455 ఎకరాలకు కొత్త ఆయకట్టు, 1957 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తి చేసామని, మున్నేరు నది నుండి సీతారామ ఎత్తిపోతల పథకం లింక్ కెనాల్ పనులు 107 కోట్ల 65 లక్షలతో మంజూరు చేసామని, మున్నేరు నది ఇరువైపులా 525 కోట్ల 36 లక్షలతో రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు చేపట్టామని డిప్యూటి సీఏం తెలిపారు. 

Read More దేశ సేవకు పునరంకితం కావాలి

ప్రతి పాఠశాలలో 9 లక్షల రూపాయలను ఖర్చు చేస్తూ జిల్లాలోని 248 ఉన్నత పాఠశాలల్లో 759 డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తున్నా మని, జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 కోట్ల 96 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులను చేపట్టామని అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 345 కోట్ల 21 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశామని, వడ్డీ లేని రుణాల పథకం క్రింద జిల్లాలో 19 వేల 27 మహిళా సంఘాలకు 37 కోట్ల 88 లక్షల రూపాయలు విడుదల చేశామని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా క్రింద 215 క్లెయిమ్ లకు 2 కోట్ల 26 లక్షలు అందజేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

Read More భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని 955 ప్రభుత్వ పాఠశాలల్లో 23 కోట్ల 63 లక్షలు ఖర్చు చేసి 821 అభివృద్ధి పనులను పూర్తి చేశామని అన్నారు.జిల్లాలో ప్రత్యేకంగా మహిళా సంఘాల ద్వారా మహిళా మార్ట్, 64 స్త్రీ టీ స్టాల్, షీ రాక్స్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇసుక రీచ్ ల నిర్వహణను మహిళా సంఘాల సభ్యులకు అప్పగించామని అన్నారు. ఇందిరా మహిళ డైయిరీ క్రింద 20 వేల స్వయం సహాయక సంఘ సభ్యులకు 80 శాతం సబ్సిడీతో 40 వేల గేదెలను మంజూరు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, మధిర నియోజకవర్గంలో 5 మండలాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామని అన్నారు. 2025-26 సంవత్సరంలో నూతనంగా 7 గురు ఎస్సి విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి క్రింద నిధులు మంజూరు చేశామని, 2025-26లో వన మహోత్సవం కార్యక్రమం క్రింద ఇప్పటి వరకు 18 లక్షల 38 వేల మొక్కలు నాటామని అన్నారు. 

Read More మద్యం మత్తులో పరస్పర దాడులు ఏడుగురు అరెస్టు

సత్తుపల్లి పట్టణం లోని నీలాద్రి అర్బన్ పార్క్ లో సఫారీ వాహనాలు, పర్యావరణ అవగాహన లైబ్రరీ, బోటింగ్ ఏర్పాటు చేశామని, వెలుగు మట్ల అర్బన్ పార్క్ ను 4 కోట్ల 25 లక్షలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం నూతన టూరిజం పాలసీని ఆవిష్కరించిందని, జిల్లాలో నేలకొండపల్లి బౌద్ధ స్థూపం, పాలేరు లేక్, ఖమ్మం ఖిల్లా, వెలుగు మట్ల అర్బన్ పార్క్ వంటి పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేశామని, ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టామని, వెలుగు మట్ల అర్బన్ పార్క్ వద్ద 40 ఫీట్ల రోడ్డు, చిన్న పిల్లల ప్లే ఏరియా అభివృద్ధి చేశామని,జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అటవీ పార్క్, కాటేజీ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నా యని తెలిపారు. పాలేరు లేక్ వద్ద బోటింగ్, క్యాంటీన్, పిక్నిక్ స్పాట్, పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, బర్డ్ వాచింగ్ కు చర్యలు తీసుకున్నామని అన్నారు.
 
అనంతరం ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరుల కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం సన్మానించారు. దేశ భక్తి గేయాలపై ఖమ్మంలోని కృష్ణ ప్రసాద్ మెమోరియల్ హై స్కూల్, హార్వెస్ట్ స్కూల్, న్యూ విజన్ హై స్కూల్, కేజీబీవీ చింతకాని, టేకులపల్లికి చెందిన టీజిఎస్.డబ్ల్యూఆర్ ఎస్ జూనియర్ బాలికల కళాశాల విద్యార్థిని, విద్యార్థులు చేసిన ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ముఖ్య అతిథి డిప్యూటీ సి.ఎం., జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం వన సంరక్షణ సమితి సభ్యులకు 9 లక్షల 20 వేల విలువ గల ఒక ట్రాక్టర్, 10 లక్షలు విలువ గల ఒక అశోక్ లే ల్యాండ్ దోస్త్ వాహనం డిప్యూటీ సి.ఎం. అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వైరా మండలం గండుగులపాడు గ్రామానికి చెందిన (19) మంది హమాలీ లబ్ధిదారులకు ఒక్కొక్కటి 47 వేల విలువ గల (19) మోటర్సైజ్డ్ హమాలీ రిక్షాలు మొత్తం 8.93 లక్షల విలువ గలవి వంద శాతం సబ్సిడీతో డిప్యూటీ సి.ఎం. అందజేశారు. 

Read More జింక మాంసం పట్టుకున్న అటవీ విశాఖ అధికారులు.

ఉద్యాన, పట్టు పరిశ్రమ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, గ్రామీణాభి వృద్ధి సంస్థ, అటవీ, స్త్రీ శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమం, నగరపాలక సంస్థ ద్వారా మెప్మా ఉత్పత్తులు, నీటి పారుదల, పశు సంవర్ధక శాఖలు, ఆర్టీసీ, హౌసింగ్, చేనేత జౌళి శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను డిప్యూటీ సీఎం పరిశీలించారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్ లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, డి.ఆర్.ఓ. ఏ. పద్మ శ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author