కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థినులకు పిలుపునిచ్చిన జాదవ్ రాజేష్ బాబు.
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భైంసాలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ హైస్కూల్ స్కూల్ భైంసా ప్రాంగణంలో విద్యార్థినుల ప్రతిభను గౌరవించే ప్రత్యేక కార్యక్రమం జరిగింది. మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని, పదవ తరగతి వార్షిక పరీక్షల్లో 1వ, 2వ, 3వ ర్యాంకులు సాధించిన ముగ్గురు ప్రతిభావంతమైన విద్యార్థినులకు తలా ₹10,000 నగదు బహుమతులు అందజేశారు.
ప్రతిభకు ప్రోత్సాహం అందించడమే కాకుండా, విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ రాజేష్ బాబు గారు మాట్లాడుతూ — “కృషి, పట్టుదల, క్రమశిక్షణతో చదువుకొని విజయాలను అందుకోవాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి” అని. జాదవ్ రాజేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థినులు సిబ్బంది పాల్గొన్నారు.