ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పోరుమామిళ్ళ, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 15: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరుమామిళ్ల మండల సమితి ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి కాలనీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొని పిల్లలు పెద్దలు మిఠాయిలు తినడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్ జాతీయ జెండాను ఎగురవేశారు . అనంతరం సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ పేదవారికి కూడు ,గూడు, దొరికినప్పుడే స్వాతంత్రం వచ్చిందని అన్నారు.
పాలకులు మారుతున్నప్పటికీ పేదవాడు పేదవాడుగా ధనవంతుడు ధనవంతుడుగా మారిపోతున్నారు. తప్ప అందరం సమానం అనే ఇలాంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడకురానికే పనికొస్తుంది తప్ప ఆచరణలు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదని వారు అన్నారు తిరుపతిరెడ్డి కాలనీవాసులు 11 సంవత్సరాలు నివాసం ఏర్పరుచుకుని ఇంటి పట్టా కోసం ఆఫీసులో వెంబడి ప్రదక్షిణలు చేయడం తప్ప ఏ ఒక్క అధికారి కూడా పేదలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పాలకులు ఆచరణలో పేదలను ఆదుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కోడూరు కేశవ, జాకోబ్, సఫా, వీరయ్య, విష్ణు, వీరవల్లి, బెల్లం బాషా, శ్రీనివాసులు, రంగాచారి, చాంద్ భాషా, వెంకటసుబ్బయ్య, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.