నేటి స్వాతంత్య్ర సంబురం, వెలకట్టలేని వీరుల పోరాటాల ఫలితం...

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

  • స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పునరంకితం కావాలి.
  • ప్రజల సంక్షేమం, అభివృద్దే ధ్యేయం ప్రతి ఒక్క అధికారి పనిచేయాలి.
  • కలెక్టర్ క్యాంపు, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన జిల్లా కలెక్టర్

WhatsApp Image 2025-08-15 at 6.56.32 PM

ఖమ్మం ప్రతినిది : వెలకట్టలేని వీరుల పోరాటాల ఫలితం ఎంతో మంది త్యాగాలతో స్వాతంత్య్రo సాధించుకున్నామని, ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం జుబ్లీపురాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు కలెక్టర్, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. 

Read More ఎగ్గమ్ గ్రామ రేషన్ డీలర్‌ సాక్కేర సునీత శేఖర్ కు ఉత్తమ అవార్డు

అనంతరం జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి హోదాలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాగణంలోని గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి,  జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

Read More ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యం..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ  నేటి  సంబురం వెలకట్టలేని వీరుల త్యాగాల రూపమని, అలుపెరుగని పోరాటాల ఫలితమని అన్నారు. బ్రిటీష్ కబంధ హస్తాల నుంచి దేశ విముక్తి కోసం అసువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని కలెక్టర్ అన్నారు. 

Read More కేరళ మోడల్ పాఠశాలలో ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకలు

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, డిప్యూటీ జడ్పీ సీఈవో నాగ పద్మజ, పీఆర్ ఎస్ఇ వెంకటరెడ్డి, పీఆర్ డిఇ మహేష్ బాబు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More శ్రావణమాసం బోనమెత్తిన శివసత్తులు

About The Author