గడ్డిఅన్నారం డివిజన్‌లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవం 

దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి వంతు అవసరం – కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!

గడ్డిఅన్నారం డివిజన్‌లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవం 
ఎల్ బీ నగర్, ఆగష్టు 15 (భారత శక్తి): గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండావందన కార్యక్రమాలు ఘనంగా, ఉత్సాహంతో నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. మన దేశ స్వాతంత్ర్యం కోసం అనేకమంది మహానీఘనంగాయులు, స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాలకు మనం రుణపడి ఉన్నాము. ఈ రోజు మన అందరం వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి, సమగ్రత కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు.కార్పొరేటర్ ప్రతి కాలనీకి వెళ్లి స్థానిక ప్రజలతో కలసి జాతీయ జెండా వందనం చేసి, పౌర సమాజంలో దేశభక్తి విలువలను పునరుద్ఘాటించారు. ఆయన మాట్లాడుతూ, స్థానిక సమస్యల పరిష్కారం కోసం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.ఈ వేడుకల్లో డివిజన్ పరిధిలో వివిధ కాలనీలలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, యువత, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని “జై హింద్” “వందే మాతరం” నినాదాలతో దేశభక్తి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా తీర్చిదిద్దారు.

About The Author