షైన్ హై స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

షైన్ హై స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), ఆగష్టు 15:
స్థానిక షైన్ హైస్కూల్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బోనకల్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకన్న జాతీయ పతకాన్ని ఎగురవేశారు అనంతరం మాట్లాడుతూ మన భారత దేశం గొప్పదని, పిల్లలందరూ కుల, మత బేధం లేకుండా సోదర భావం తో మెలగాలని, దేశ అభివృద్ధి కి తోడ్పడాలని అన్నారు.రాబోయే కాలానికి యువత పిల్లలే అని దేశ అభివృద్ధి వారి చేతుల్లోనే ఉందని అన్నారు.పిల్లలు ఎటువంటి వ్యసనాలకు లోనవద్దని, దేశ భక్తిని నర నరాల్లో నింపుకోవాలని అన్నారు.అనంతరం పాఠశాల కరెస్పాండంట్ అన్సార్ పాషా మాట్లాడుతూ, మన దేశం లో, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న మతాలు ఉన్నాయని, అయినప్పటికి భారతీయులం అందరం కలిసి మెలిసి ఉంటామని, అందరం ఒక్కటే అని అన్నారు.ఈ కార్యక్రమం లో బోనకల్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకన్న , కరెస్పాండంట్ అన్సార్ పాషా, డైరెక్టర్ లాల్ మహమ్మద్, ప్రిన్సిపాల్ ఎ.శ్వేత, అడ్మినిస్ట్రేషన్ పి.నాగేశ్వరావు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

About The Author