భైంసా ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

భైంసా ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆగస్టు 15: భైంసా పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, సామాజిక, రాజకీయ, మత సంస్థల్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భైంసా డివిజన్ సబ్‌ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ డివిజన్ సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు అర్పించి, పోలీసు విభాగం నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అజ్మీర సంకేత్ కుమార్ విద్యార్థులకు మాట్లాడుతూ, “భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కాలంలో దేశం ఏం కోల్పోయింది, ఏం సాధించింది అనే విషయాన్ని మనం విశ్లేషించుకోవాలి. మరో 21 సంవత్సరాల తరువాత దేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేయనుంది. ఆ శతాబ్ది సందర్భంగా విద్యార్థులు భారతదేశాన్ని స్వర్ణిమ, స్వేచ్ఛా భారత్‌గా ప్రపంచానికి పరిచయం చేయాలి. విద్యలో ముందుకు సాగి దేశానికీ, తల్లిదండ్రులకూ గౌరవం తేవాలి” అని పిలుపునిచ్చారు.
 
భైంసా ఏరియా హాస్పిటల్‌లో స్థానిక ఎమ్మెల్యే ముధోల్ రామ రావు పటేల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తన కార్యాలయంలో, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కార్యాలయంలో, మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ మున్సిపల్ కార్యాలయంలో, తదితరులు తమ తమ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ విద్యాసంస్థలు, కార్యాలయాల్లో కూడా ఘనంగా పతాకావిష్కరణలు జరిగాయి.

About The Author