రోడ్డుపై చిరు వ్యాపారుడి దేశభక్తి, ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆగస్ట్ 15: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా బైంసా రోడ్డు పక్కనే మైను ఫ్రూట్స్ పేరుతో చిరు పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న ఓ యువ వ్యాపారి దేశభక్తిని చాటుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించిన వ్యాపారి, పక్కనే పండ్ల బండిపై దేశభక్తిని ప్రతిబింబించే అలంకరణలు చేశారు. స్థానికులు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వ్యాపారి మాట్లాడుతూ, "దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మరణకు ఇది చిన్న గుర్తు. దేశభక్తి పెద్దోళ్లకే పరిమితం కాదు. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో దేశ సేవ చేయాలి," అని మైను చెప్పారు.