ఎగ్గమ్ గ్రామ రేషన్ డీలర్ సాక్కేర సునీత శేఖర్ కు ఉత్తమ అవార్డు
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆగస్టు 15 : నిర్మల్ జిల్లాలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు బైంసా మండలంలోని ఎగ్గమ్ గ్రామానికి చెందిన రేషన్ సక్కెర సునీత డీలర్‌కు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు ప్రదానం చేయబడింది. 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ ఆమెను సన్మానించారు.
సాధారణ ప్రజలకు నాణ్యమైన రేషన్ సరఫరా, వ్యవస్థాగత నిబద్ధత, పారదర్శకతతో కూడిన సేవలందించడం వంటి అంశాల్లో రేషన్ డీలర్ అనన్యమైన ప్రతిభ చూపించినట్టు అధికారులు తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన ధ్యేయమని అవార్డు స్వీకరించిన డీలర్ సునీత అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనను అభినందిస్తూ, తమ గ్రామానికి ఈ రకమైన గౌరవం లభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, అవినాష్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.