గత పాలకుల నిర్లక్ష్యంలో కాజీపేట కుంటు పడింది.
ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)జూలై22:
గత పాలకుల నిర్లక్షంతో కాజీపేట అభివృద్ధి కుంటు పడింది అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం సోమిడి జంక్షన్ లో రూ.2 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న కాజీపేట నుంచి సోమిడి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కాజీపేట కు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మేము నేడు అధికారంలో వచ్చిన క్రమంలో అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.రెండు డివిజన్ నడుమ ఉండే ప్రధాన రహదారి కావడంతో ప్రజా రవాణాకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో కాజీపేట్ నుంచి సోమీడి వరకు రోడ్డు పనులను చేపట్టామని అన్నారు.గతంలో కొంత మేరకు జరిగిన పనులను ఇప్పుడు పూర్తి స్థాయిలో చేపట్టామని తెలిపారు.నగర అభివృద్ధిలో కార్పొరేషన్,కుడా సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సోమిడి జంక్షన్ అభివృద్ధికి రానున్న రోజుల్లో నిధులు కేటాయించి సుందరికరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.