తెలంగాణలోని ప్రతీ రంగాన్ని, ప్రతీ ఒక్కరిని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణలోని ప్రతీ రంగాన్ని, ప్రతీ ఒక్కరిని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూలై 19: ఓటు వేసిన పాపానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమను కాటికి పంపుతుందన్న నిజం తెలంగాణ ప్రజలకు అర్థమైందని కేటీఆర్ అన్నారు.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 సీట్లతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని,తెలంగాణలోని ప్రతీ రంగాన్ని, ప్రతీ ఒక్కరిని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు.

అందుకే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారని అన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దాకా తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా, ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేసినా వదిలిపెట్టేది లేదని తెలిపారు. 

Read More రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన హోంగార్డు కు 15 లక్షల భీమా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్.

ప్రజలను పీక్కు తింటున్న రేవంత్ రెడ్డి భరతం పడతామని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి పటిష్ట పునాదులు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో కేసీఆర్ పది సంవత్సరాలు పనిచేశారన్నారు.

Read More ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక రవాణా 

 వ్యవసాయం, సాగునీరు, పట్టణ అభివృద్ధి, పల్లె ప్రగతి, విద్యా, వైద్యం, గిరిజన, దళిత సంక్షేమం, మైనార్టీ, మహిళలతోపాటు బలహీన రంగాలకు సంక్షేమం కోసం పనిచేసి ప్రతి రంగంలో భారతదేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపామని అన్నారు. 

Read More ఆధునిక పరిజ్ఞానముతో వీణా కంటి హాస్పిటల్లో నేత్ర వైద్య పరీక్షలు..

 ఇవాళ తెలంగాణ పాటిస్తే రేపు దేశం అనుసరిస్తుంది అన్నట్టు పని చేశామని, 2014లో కేవలం 63 సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ 2018 నాటికి 88 సీట్లను గెలుచుకుందని తెలిపారు. 
కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి 2023లో మాత్రం ప్రజలు వారికి అధికారాన్ని కట్టబెట్టారని,
బోగస్ మాటలతో రైతులను, ఆగం పట్టించిండ్రు. రాహుల్, ప్రియాంక గాంధీలను పిలిపించి యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులను బురిడీ కొట్టించారని అన్నారు.

Read More గ్రూప్స్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ లకు ఉచిత శిక్షణ 

 ఫ్రీ బస్సు, నెలకు రూ. 2500, తులం బంగారం పేరుతో ఆడబిడ్డలను దగా చేశారు. పెద్ద మనుషుల్లో ఇద్దరికీ నెలకు రూ. 4,000 పెన్షన్ ఇస్తామని వాళ్లను కూడా ఘోరంగా మోసం చేశారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో, బీసీ సబ్ ప్లాన్, లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి బీసీలను మోసం చేశారు.

Read More సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రణాళికలు..

 ఖమ్మంలో ఉన్న ప్రత్యేక రాజకీయ సమీకరణాల కారణంగా 2023లో పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ కాటేసి కాటికి పంపుతుందన్న నిజం తెలంగాణ ప్రజలకు అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు జరిగితే 100 సీట్లతో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న నిజం కాంగ్రెస్, బీజేపీలకు తెలుసునని అన్నారు. ఇంత నీచమైన రాజకీయాలు ఉంటాయని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఊహించలేదని, అందుకే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే రీకాల్ వ్యవస్థను రాజ్యాంగంలో పెట్టలేదని తెలిపారు. 

Read More దుర్గా నగర్ కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనుల పరిశీలన

 అందుకే తెలంగాణ ప్రజలు మరో మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓపిగ్గా భరించాల్సి వస్తుందని, ఒక్క తప్పు ఓటు వేసినందుకు ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలంగాణ ప్రజలకు అర్థమైందని అన్నారు. ప్రతినాయకుడు ఉంటేనే నాయకుడి విలువ తెలుస్తుంది. గుర్రం విలువ తెలవాలంటే గాడిదను చూడాలని,కాంగ్రెస్ అనే గాడిద తెలంగాణలో సృష్టిస్తున్న అరాచకాలను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.

Read More భైంసాలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా: జి.జానకి షర్మిల..

About The Author