కొబ్బరి పీచు పరిశ్రమని సందర్శించిన పటేల్ గూడ మహిళలు

సంగారెడ్డి :

WhatsApp Image 2025-09-26 at 5.34.38 PM

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్ గూడా లో కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాయర్ బోర్డ్ ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలు 
గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సత్యనారాయణ కొబ్బరి పీచు పరిశ్రమను సందర్శించారు.ఈ పరిశ్రమ వ్యవస్థాపకులు చెన్నంశెట్టి మౌనిక ఉదయ్ కుమార్ వారికి తాగి పడేసే కొబ్బరి బొండాలతో పీచు మరియు కొబ్బరి పొట్టు తయారీ విధానాన్ని మహిళలకు వివరించారు. కొబ్బరి పీచుతో కొబ్బరి తాడు మరియు వివిధ రకాల బొమ్మలు తయారు చేయవచ్చని అదేవిధంగా కొబ్బరిపొట్టుతో డీకంపోస్ట్ చేసి మొక్కలకి ఎరువుగా వాడొచ్చని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో క్వాయర్  బోర్డ్ ప్రోగ్రాం మేనేజర్ ప్రసాద్ ట్రైనర్ మీనా మహిళలు పాల్గొన్నారు. 

About The Author