నేటి బాలల క్షేమమే, రేపటి భారత సంక్షేమం

"సాహిత్య కళా విభూషణ"స్వర్ణ నంది పురస్కార గ్రహీత చౌడూరి నరసింహారావు పత్రికారచయిత, సామాజిక విశ్లేషకులు

నేటి బాలల క్షేమమే, రేపటి భారత సంక్షేమం

హైదరాబాద్, జూలై 18:
మన దేశంలో బాల కార్మిక వ్యవస్థ ఇంకా కొనసాగుతూ ఉండడం సభ్య సమాజానికి తలవంపేనని సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఆ దుర్వ్య వస్థ నిర్మూలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం మార్గ నిర్దేశాలనూ సూచించింది. భారత రాజ్యాంగంలోని 24వ అధికరణ ప్రకారం బాల కార్మిక వ్యవస్థను జాతి ముఖచిత్రం నుంచి తుడిచి పెట్టాలని ఆదేశించింది. బడికి వెళ్లే వయసులో పిల్లలను పనిలో పెట్టి వారి బాల్యాన్ని హరించకుండా నిషేధిస్తూ దేశంలో కర్మాగారాల చట్టం వంటి ఎన్నో శాసనాలను ఉన్నాయి. ప్రత్యేకించి బాలలకు ఉపాధి చట్టం 1938, బాల కార్మిక నిరోధక నిషేధిత చట్టం 1986 వంటివి అమలులో ఉన్నాయి. కానీ ఇప్పటికీ బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. కేవలం భవన నిర్మాణ పనుల్లోనే కాకుండా, శివకాశి వంటి చోట్ల అతి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో కూడిన బాణాసంచా తయారీ పరిశ్రమల్లోనూ, అలాగే రసాయనిక పరిశ్రమల్లోనూ బాల కార్మికులు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. లక్షల పేద కుటుంబాలకు పిల్లలే పెట్టుబడిగా మారడం మహా విషాదం! ఇది ఎంతో ప్రమాదకరమైన పరిణామం!

WhatsApp Image 2025-07-19 at 09.11.39(2)

Read More ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక రవాణా 

పేదరికాన్ని అడ్డం పెట్టుకుని...
కొన్ని వర్గాల వారు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని పిల్లల శ్రమశక్తిని అతి చౌకగా దోచుకుంటున్నారు. బాల కార్మిక చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముఖ్యమైన మార్పులు చేసింది. ప్రమాదకరం కాని కుటుంబ వ్యాపారాలు, కుటుంబ వృత్తుల్లో 14 ఏళ్లలోపు పిల్లలతో పని చేయించుకోవడానికి అనుమతినిచ్చింది. వినోద పరిశ్రమల్లోనూ, క్రీడా కార్యక్రమాల్లోనూ వారితో పని చేయించుకోవడానికి వెసులుబాటును కల్పించింది. బాల కార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదమూ తెలిపింది. వ్యవసాయం, హస్తకళలు వంటి రంగాల్లో పిల్లలు తమ తల్లిదండ్రులకు సహకరిస్తారని,  ఆ వృత్తిలోని మెళుకువలు పిల్లలు నేర్చుకుంటారని వివరించింది.  దేశంలోని సామాజిక నిర్మాణం సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్ఠీకరించింది. ప్రమాదకరం కాని కుటుంబ వ్యాపారాలు, టీవీ సీరియళ్లు, చలనచిత్రాలు, ప్రకటనలు, సర్కస్ మినహా ఇతర క్రీడల్లో మాత్రమే పిల్లలతో పని చేయించుకోవచ్చని వెల్లడించింది. అయితే పాఠశాలల పని వేళలు ముగిసిన తర్వాతే పని చేయించుకోవాలని నిబంధన విధించింది.

Read More గ్రూప్స్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ లకు ఉచిత శిక్షణ 

ప్రమాదకరమైన పనుల్లో 14 నుంచి18 ఏళ్ల వయసున్న వారిని నియమించుకోరాదని హెచ్చరించింది. చట్టాన్ని ఉల్లంఘించిన తల్లిదండ్రులకు, సంరక్షకులకు గతంలో సంస్థ యజమానితో సమానంగా శిక్షలు ఉండేవి. తాజా సవరణల ప్రకారం మొదటి సారి తప్పు చేస్తే తల్లిదండ్రులు సంరక్షకులకు శిక్ష పడదు. రెండోసారి, ఆపైన పాల్పడే ఉల్లంఘనలకు గరిష్టంగా పదివేల రూపాయల జరిమానా విధిస్తారు. మొదటిసారి ఉల్లంఘనకు పాల్పడేవారికీ ఆరునెలల నుంచి రెండేళ్ల వరకు జైలు,20వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి ఉల్లంఘిస్తే 6 నుండి 24 నెలలు, 12 లేదా 36 నెలల దాకా జైలు శిక్ష విధిస్తారు. గతంలో 18 వృత్తులు 65 ప్రక్రియలోని 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలోకి తీసుకోవడాన్ని నిషేధించారు. తాజా చట్టం ప్రకారం అన్ని వృత్తుల్లోనూ, ప్రక్రియలోనూ 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలోకి తీసుకోవడాన్ని నిషేధించారు. కొత్త చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయవచ్చు. అయితే చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే అనేకసార్లు విస్మరించడం, అతిక్రమించడం తీవ్ర పరిణామం. బాలలతో వెట్టి చాకిరి నిర్మూలన, పునరావాస కల్పన కోసం ప్రభుత్వాలు కృషిని ఇంకా తీవ్రంగా చేయాలి. కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ ముస్కాన్' పేరిట చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ప్రక్రియ కొంత మంచి ఫలితం ఇచ్చింది. చట్ట నిబంధనలతో పాటు పౌర సమాజంలోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read More వైష్ణోయ్, ప్రెస్టీజ్ గ్రూపుల అక్రమాలను అరికట్టే నాధుడే లేడా..!

WhatsApp Image 2025-07-19 at 09.11.39

Read More యువతను నిర్వీర్యం చేస్తున్న నిరుద్యోగ సమస్య..

హింసకు, నిర్లక్ష్యానికి బలౌతున్న బాల కార్మికులు...
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) రూపొందించిన చట్టాన్ని భారత్ తో సహా అనేక దేశాలు సమ్మతించి సంతకాలు కూడా చేశాయి. కేంద్రం కొత్త చట్టంలో ప్రమాదకర పనుల జాబితాను 83 నుంచి 31 కుదించడం  ఆందోళన కలిగించే విషయం.  బాల కార్మిక వ్యవస్థ మూలాలకు చికిత్స చేయాలని 'గురుపాద స్వామి కమిషన్' దశాబ్దాల క్రితమే ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. బాల కార్మిక వ్యవస్థ దేశంలో తీవ్ర సామాజిక సమస్యగా పరిణమించింది. బాలల హక్కుల ఉల్లంఘనకు మారుపేరుగా మారింది. పిల్లల మనుగడ, అభివృద్ధి, విద్యా, విశ్రాంతి, ఆటపాటలు, తగిన జీవన ప్రమాణాలు, శారీరక, మానసిక అభివృద్ధి, జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం వంటివి కొరవడుతున్నాయి. బాల కార్మికులు హింసకు, నిర్లక్ష్యానికి గురవుతుండటం చూస్తే మనసు  కలిచి వేస్తుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు 25.1 కోట్లుగా ఉంది. ఆ సంఖ్య దేశంలో మొత్తంగా 24.6% గా నమోదయింది. బాలలు పనులు చేయడానికి ఆర్థికపరంగానే కాకుండా, మానవ హక్కుల సమస్యలుగా పరిగణించాలి. లైంగిక దోపిడీ, భిక్షాటన, స్మగ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాల్లోనూ బాలలను వినియోగిస్తూ ఉండడం చూస్తుంటే గుండెల్ని పిండేస్తుంది.

Read More బిసీలకు 42 శాతం రిజర్వేషన్ల కొరకు ఉద్యమాన్ని ఉదృతం చేయాలి..

WhatsApp Image 2025-07-19 at 09.11.39(1)

Read More రాజకీయాలకతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి..

తల్లిదండ్రుల్లో అవగాహన కలిగించాలి...
ఉత్తర్ ప్రదేశ్ లో  అత్యధికంగా 15శాతం బాల కార్మికులు ఉండగా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వారి సంఖ్య 10.8 శాతం.  దేశంలోని మొత్తం బాల కార్మికుల్లో 53శాతం. ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బంగ్లా రాష్ట్రాల్లో 20 శాతం గా నమోదయింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర పనుల్లోనూ పిల్లలు మగ్గిపోతున్నారు. జాతీయ నమూనా సర్వే ప్రకారం పట్టణాల్లో 97 లక్షలు, గ్రామాల్లో కోటి 20 లక్షలకు పైగా పిల్లలు కాయకష్టం చేస్తున్నారు. పేదలు వెనుకబడిన వర్గాల కుటుంబాలకు చెందిన పిల్లలు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నివేదిక స్పష్టం చేసింది. విద్యకు దూరమైన పిల్లలందరినీ బాల కార్మికులుగా గుర్తించి బడిలో చెర్పించాలని పలు స్వచ్ఛంద సంస్థలు, కమిషన్లు, సామాజిక కార్యకర్తలు, పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా సూచిస్తున్నారు. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని నిర్దుష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాలల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. తల్లిదండ్రుల్లో అవగాహనను పెంచేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం బాధ్యతగా ప్రచార ఉద్యమం చేపట్టాలి. ఇప్పటికే కృషి సాగిస్తున్న వారిని గుర్తించి మరింత ప్రోత్సహించాలి. బాలల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించాలి. బాల్యానికి రక్షణ, సంరక్షణ కలిగిస్తూ.. సామాజిక బాధ్యతగా భావిస్తూ.. నేటి బాలల క్షేమంతో రేపటి భారతదేశాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశలో ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు కృషి చేయాలి.

Read More పచ్చదనం పెంపొందించడంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

About The Author