ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను, కుంటలను నింపాలి
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 22: ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను,కుంటలను నింపాలని, ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేపట్టాలని తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రగతి డిగ్రీ కాలేజీలోఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ అధ్యక్షతన సిపిఐ (ఎం ఎల్ ) న్యూడెమోక్రసి తుంగతుర్తి సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య, సిపిఐ జిల్లా నాయకులు ఎల్లంల యాదగిరి, బి ఆర్ఎస్ జిల్లా నాయకులు కందుకూరి ప్రవీణ్ లు మాట్లాడుతూ ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి సూర్యాపేట జిల్లా కి 2 లక్షల ఎకరాలు కి పైగా నీళ్ల ఇవ్వాలని,రుద్రమ చెరువును రిజర్వాయర్ గా చేయాలని, ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేపట్టి, చెరువులను,కుంటలను నింపాలన్నారు. రైతులు నార్లు పోసుకొని నాటు పెట్టడం కోసం సిద్ధంగా ఉన్న సమయంలో వర్షాలు రాక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరును విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.
వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు నార్లు పోసుకున్నప్పటికీ నాటు పెట్టడం కోసం నీరు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం తుంగతుర్తి, సూర్యపేట, కోదాడ ప్రాంతాలకి ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరు అందించి రైతులను ఆదుకోవాలని అన్నారు. వర్షాలు రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశతో ఉన్నందున ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, కే సోమేశ్,బచ్చు విజయ్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.