ఎండిఆర్ హైస్కూల్లో స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్స్ నిర్వహణ  

ఎండిఆర్ హైస్కూల్లో స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్స్ నిర్వహణ  

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 19: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎండిఆర్ హైస్కూల్ నందు శనివారం స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఓటర్లుగా విద్యార్థులు పాల్గొన్నారు. పోటీ చేసే అభ్యర్థులు 8వ తరగతి 9వ తరగతి విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఇట్టి ఎన్నికలను ప్రతి సంవత్సరం ఎం డి ఆర్ హైస్కూల్ నందు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం.

ఇట్టి స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ముఖ్యఅతిథిని మండల నోడల్ ఆఫీసర్ బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి జిహెచ్ఎం జడ్పీహెచ్ఎస్ హుజూర్ నగర్, ఎం డి ఆర్ విద్యాసంస్థ చైర్మన్ మేరెడ్డి దామోదర్ రెడ్డి, ఎం డి ఆర్ విద్యాసంస్థ ప్రిన్సిపల్ నలబోలు భూపాల్ రెడ్డి, ఏఓ పింగళి నర్సిరెడ్డి,  విద్యార్థి ఎన్నికలలో అతిథులుగా పాల్గొన్నారు. ఎలక్షన్లు ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని దాని కొరకు ఇప్పటినుంచే ఒక ప్రణాళిక నిర్వహించాలని మన దేశం ఎన్నికల ద్వారా అనగా ప్రజాస్వామ్యం ద్వారా పరిపాలించ బడుతుందని విద్యార్థులకు తెలియజేస్తున్న ఎం డి ఆర్ హై స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎం డి ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మే రెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.  

Read More ముఖ గుర్తింపు తో పెన్షన్ ఇవ్వడం వల్ల అక్రమాలకు చెక్.

IMG-20250720-WA0830

Read More  పేదల దీవెనలతోనే ఇందిరమ్మ ప్రభుత్వం

ఎం డి ఆర్ విద్యాసంస్థ ప్రిన్సిపల్ నలబోలు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ విద్యాసంస్థలందు స్టూడెంట్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందని, ఎందుకంటే విద్యార్థులను దేశ భవిష్యత్తు నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించే విధంగా తయారు చేయడం తమ పాఠశాల బాధ్యతగా స్వీకరిస్తామన్నారు. సభను ఉద్దేశించి ఏవో నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధిని సాధించాలన్నారు. కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ గా ప్రిన్సిపాల్ నలబోలు భూపాల్ రెడ్డి వ్యవహరించగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గా బానోతు రమేష్ వ్యవహరించారు. ఇట్టి కార్యక్రమంలో ఎన్నికల అధికారులుగా వెంకట్ రెడ్డి, శ్రీను,నరసింహారావు,కృష్ణ,చినబాబు, భద్రాద్రి బాబు,మోయిన్,సైదులు మమత,సారిక మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు.

Read More ఆధునిక పరిజ్ఞానముతో వీణా కంటి హాస్పిటల్లో నేత్ర వైద్య పరీక్షలు..

About The Author