సంక్షేమ కార్యక్రమాలు ఆపే ప్రసక్తే లేదు

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వ చేయూత: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సంక్షేమ కార్యక్రమాలు ఆపే ప్రసక్తే లేదు

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూలై 18: రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలద్రొక్కుకునేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి, శుక్రవారం స్థానిక వెలుగుమట్ల అర్బన్ పార్క్ లో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో చేపడుతున్న అన్ని పథకాలు మహిళల పేరునే అని, ఏ పథకమైన మహాలక్ష్ముల చేతుల్లోనే అని అన్నారు. మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, మొదటి సంవత్సరం 21 వేల కోట్లు అందించామని, రెండో సంవత్సరం ఇప్పటికే 6 వేల కోట్లు మహిళలకు అందించినట్లు తెలిపారు. మహిళల రుణాల రికవరీ 99 శాతం, కొన్నిచోట్ల 100 శాతం ఉందన్నారు. జిల్లాలో 2 లక్షల మంది మహిళలు ఉంటే, స్వయం సహాయక సంఘాల్లో 40 వేల మంది మాత్రమే సభ్యులున్నారని, సంఘాల్లో నమోదు కాని వారందరూ వెంటనే నమోదు అవ్వాలని అన్నారు. 

Read More మూసీ న‌ది గ‌ర్భంలో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

రాష్ట్రంలో 22 వేల 5 వందల కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసుకున్నామని, అర్హులకు ముందుగా మొదటి విడతలో అందజేస్తామన్నారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లు మొదటి విడతలో వచ్చినట్లు, గుడిసెల్లో ఉంటున్న వారికి ప్రాధాన్యత ఇచ్చి అందజేస్తామన్నారు.

Read More ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక రవాణా 

IMG-20250720-WA0856

Read More ఉపాధ్యాయ పదోన్నతులను పారదర్శకంగా చేపట్టాలి.

కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, లోన్లు, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఈ కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ అని అన్నారు. 

Read More జి ప్లస్ త్రీ మోడల్ ఇండ్ల నిర్మాణానికి స్థలసేకరణ పనులు వేగవంతం చేయాలి

వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నగర పరిధిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలం తో వెలుగుమట్ల అర్బన్ పార్క్ జిల్లాకు ఒక మంచి ఆస్తి అని అన్నారు. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసి, ప్రజలు ఒక గంట పార్క్ కు వచ్చి, వాకింగ్ చేస్తే, అన్ని బాధలు మర్చిపోయి, ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపడతామన్నారు. ఫెన్సింగ్ చేసి, జంతువుల తెచ్చి, పిల్లల ఆట వస్తువుల ఏర్పాటు, ఒకదాని వెంట ఒకటి అన్ని సౌకర్యాలు కల్పించి భవిష్యత్తులో బ్రహ్మాoడమైన పార్క్ గా, హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్ కు ప్రజలు వచ్చినట్లు, అర్బన్ పార్క్ ను తీర్చిదిద్దుతామన్నారు.

Read More ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం..

ఖిల్లా రోప్ వే పనులు చేపట్టి, టూరిజం, మునిసిపల్ శాఖల సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఖమ్మం ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా జీవించేలా పరిస్థితులు సృష్టిస్తామని అన్నారు. ఖమ్మం పచ్చగా, పరిశుభ్రంగా, ఆనందంగా ఉండేలా అన్ని చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.

Read More నూతన సాంకేతిక విధానంతో ఉద్యాన పంటలను సాగు చేయాలి.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా స్వయం సహాయక సంఘాలచే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ కొట్టించి, వారికి 5.6 కోట్ల రూపాయలు, వడ్డీ లేని రుణాలు అందించి, అంచెలంచెలుగా మహిళల ఆర్థిక అభివృద్ధి కి చర్యలు చేపట్టిందన్నారు.

Read More బొమ్మరిల్లు కాలనీలో వనమహోత్సవం సందర్భంగా 150 మొక్కలు నాటిన స్థానికులు.

జిల్లాలో 9 వేల పైచిలుకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉండి, రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉన్నామని, ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 2700 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు. ప్రమాద భీమా, లోన్ భీమా, జిల్లాలో 20 వేల కొత్త రేషన్ కార్డులు, 60 వేల కొత్త సభ్యుల చేర్పు, ఒక్కో సభ్యునికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 3వేల నూతన రేషన్ కార్డుల జారీ జరిగిందని కలెక్టర్ తెలిపారు.

Read More పాత ఇండ్ల కూల్చివేతకు అధికారుల నిర్లక్ష్యం..

కార్యక్రమంలో రఘునాథపాలెం మండలానికి సంబంధించి 934 సంఘాలలోని 9340 మంది సభ్యులకు 1.18 కోట్లు, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 2958 సంఘాలలోని 29580 మంది సభ్యులకు 2.81 కోట్లు, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 3.99 కోట్ల వడ్డీ లేని రుణాలు, మరణించిన 15 మంది సభ్యులకు రూ. 11.76 లక్షలు లోన్ భీమా మంజూరు చేసి, సంబంధిత సంఘాలకు చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.

Read More కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, డిఎం సివిల్ సప్లయీస్ శ్రీలత, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ రావూరి కరుణ, కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Read More ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలి

About The Author