దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి 

సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్

దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి 

కడప, భారత శక్తి ప్రతినిధి, జూలై 15: మంగళవారం ఉదయం 10 గంటలకు, 'దళిత ఐక్య వేదిక" జిల్లా అధ్యక్షులు ఎన్.నారాయణ జిల్లాలోని దళితుల భూముల భూకబ్జాలకు వ్యతిరేకంగా చేస్తున్న "రిలే నిరాహారదీక్షల"కు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంపూర్ణ మద్దతు తెలియజేశారు. నేడు కడప జిల్లాలోని 36 మండలాలలో దళితుల భూముల కబ్జా, వివక్షత, గ్రామ బహిష్కరణలు, దాడులు, హక్కుల హరణ, ప్రభుత్వాలు మారినా, పాలకులు మారిన జరుగుతున్నాయని ఆరోపించారు. దళిత బహుజన వర్గాల బాధితులు ఒంటరి పోరాటాలు చేస్తున్నారని వారికి మనోధైర్యాన్ని కల్పించే సంఘీభావ పోరాటాలు సమాజంలో రావాల్సిన అవసరం ఉందన్నారు.

దళిత జనుల బాధాతత్పరిత జీవితాలు వింటే దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు. గ్రామీణ ధనిక పెత్తందారీ వర్గాల అణిచివేతతో గ్రామాల్లో మానవత్వం నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. కులతత్వం గుమ్మాల ముందు గజ్జ కట్టి ఆడుతూ పెను ప్రమాదంగా విస్తరిస్తోందన్నారు. దళిత చైతన్యానికి వర్గ దృక్పథం కలిగిస్తేనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో సామాజిక న్యాయ పోరాటాలు "కులవక్షత వ్యతిరేక పోరాట సంఘం" ఆధ్వర్యంలో ప్రారంభిస్తామన్నారు. పేదలపై కపట ప్రేమ కురిపిస్తున్న పాలక ప్రభుత్వాల గుట్టు రట్టు చేయాలని పిలుపునిచ్చారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు ఏవైనా, పరోక్షంగా ప్రభుత్వాలే గ్రామాల్లో దోపిడి పీడనను, దౌర్జన్యాన్ని ప్రోత్సహించి అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. గ్రామీణ ఆధిపత్య వర్గాలతో ప్రభుత్వాలు రాజీపడి పాలిస్తున్నాయని ఆరోపించారు. 

కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జకరయ్య మాట్లాడుతూ.. కలెక్టర్ ఆఫీసుకు కూత వేటు దూరంలో కడప మండలంలోని పాత కడప దళితులకు 5 దశాబ్దాల క్రిందట నాటి ప్రభుత్వం సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇస్తే, స్థానిక గ్రామీణ ధనిక పెత్తందారి వర్గాలు అన్యక్రాంతం చేసుకుని, నకిలీ రికార్డులు సృష్టించి, వేంచర్లు వేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయల అర్జిస్తున్నారని, దళితుల భూములు కాపాడడంలో పాలక ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వైఫల్యం చెందారని వారు ఆరోపించారు. దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు ఎన్.నారాయణ మాట్లాడుతూ.. కాశీనాయన మండలం మూలపల్లె గ్రామంలో దళితుల భూములు ఆక్రమించుకొని అనుభవించుకుంటున్నారని ప్రశ్నిస్తే, పై అధికారులకు ఫిర్యాదు చేస్తే, చంపుతామని బెదిరిస్తున్నారని, అధికారులు కూడా చూసి చూడనట్టుగా వెళుతూ బాధితులపైనే బల ప్రయోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీయిజం తో అన్యాక్రాంతం చేసుకున్న దళితుల భూములు దళితులకే తిరిగి ఇప్పించి, రక్షణ కల్పించాలని వారు జిల్లా కలెక్టర్ వారిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డబ్ల్యూ.రాము., కె.వి.పి.ఎస్. జిల్లా నాయకులు జితేంద్ర., దళిత నాయకులు జార్జి., ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మునెయ్య, బీ.సీ.సంఘం జిల్లా నాయకులు వెంకటసుబ్బయ్య తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి