పాలిటిక్స్
పాలిటిక్స్ 

ప్రవేట్ పాఠశాలలా, కళాశాలల ఫీజుల దోపిడిని అరికట్టండి:జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్

ప్రవేట్ పాఠశాలలా, కళాశాలల ఫీజుల దోపిడిని అరికట్టండి:జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 28: ఖమ్మం పట్టణం లోని ప్రెవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడిని అరికట్టాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణామాచారి తో కలిసి ఖమ్మం సబ్ కలెక్టర్ కి వినతి పత్రన్ని అందించారు. అనంతరం శ్రీనివాస్ మీడియా మాట్లాడుతూ ఖమ్మం పట్టణం లో విద్య వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది అనీ పీజు నియంత్రణ లేకుండా పోయింది అన్ని ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్ట రాజ్యంగా చేస్తున్నారని అయన అన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించక పొగ ఒక్క క్యాంపస్ కి పర్మిషన్ తీసుకొని 4నుంచి 5 క్యాంపస్ లు నడుపుతున్న అధికారులు పటించుపోవటం బాధాకరం అన్ని శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా ప్రెవేట్ పాఠశాల లు నర్సరీ విద్యార్థికి 70నుంచి 80 వేలు పీజులు వసూలు చేస్తున్నారు. బుక్స్ అని డ్రెస్స్ అనీ అధిక మొత్తంలో పీజులు వసూలు చేస్తున్నారు. అనీ ఇంతకీ నిబంధనలు అనీ పాటిస్తున్నారా అంటే అది లేదు పైరుఇంజన్ కూడా తిరగనటువంటి ఇరుకు అయిన బిల్డింగ్ లను అద్దె కి తీసుకొని పిల్లలను హింసకు గురి చేస్తున్నారు. ఫిటినెస్ లేని బస్సులు, అర్హత లేని ఉపాధ్యాయులు అస్తవేస్తమైన హాస్టల్ సౌకర్యలతో పిల్లలు ఇబ్బంది పడుతుంటే వారి తల్లి తండ్రులు అనేక మంది మాకు పిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకు పోయామని అధికారులకు కొంత సమయాన్ని ఇచ్చిన తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో దిగుతాం అనీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యాక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె వెంకటరామయ్య ప్రధాన కార్యదర్శి కేతనబోయిన నాగయ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ కల్లూరు మండల ప్రధాన కార్యదర్శి మోడేపల్లి వెంకటాచారి, మండల నాయకులు ఎనుముల రాము యాదవ్, బయ్యారపు నరేంద్ర, లాయర్ చారి తదితరులు పాల్గొన్నారు.
Read More...
పాలిటిక్స్ 

బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు లాగులు తడిశాయి : బిఆర్ఎస్ నగర అధ్యక్షులు హరిశంకర్ పైర్

బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు లాగులు తడిశాయి : బిఆర్ఎస్ నగర అధ్యక్షులు హరిశంకర్ పైర్ కరీంనగర్, మార్చి 25(భారత శక్తి): కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం, కేటీఆర్ ర్యాలీనీ చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులకు లాగులు తడిసినాయని నగర పార్టీ అధ్యకులు చల్ల హరిశంకర్ ఆరోపించారు. కేటీఆర్ ను విమర్శించే స్థాయి సునీల్ రావు కు లేదనీ, ఆయన కాలిగోటికి కూడా సరిపోవని మండిపడ్డారు. మంగళవారం మంకమ్మతోటలోని క్యాంపు కార్యాలయంలో నగర కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శి బోనకూరి సాయికృష్ణ, నాయకులు ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరిశంకర్ మాట్లాడుతూ సునీల్ రావుకు మేయర్ పదవి, ఆ హొదానీ కల్పించింది బి ఆర్ ఎస్ పార్టీ అని, అధికారం కోసం జోకే చరిత్ర సునీల్ రావుదని ఎద్దేవా చేశారు. మేయర్ పదవిని దొడ్డిదారిన పొంది కోట్లు సంపాదించిన ఘనత సునీల్ రావుకు దక్కిందన్నారు. కరీంనగర్ రాజకీయాల్లో ఉసర వెళ్ళిగా సునీల్ రావుకు పేరుందనీ చెప్పారు. ఊసర వెళ్లి సునీల్ రావు పట్ల బండి సంజయ్ జాగ్రత్త గా ఉండాలనీ సూచించారు.. అత్యంత అవినీతి పరుడు ఎవరని గూగుల్ లో వెతికితే సునీల్ రావు పేరు వస్తుందనీ ఆరోపించారు.ఉడుం సొచ్చినట్లు బీజేపీ లో సొచ్చిండనీ.. బీజేపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలనీ చెప్పారు. బిఆర్ఎస్ నేతలను విమర్శిస్తే ఖబడ్దార్… సునీల్ రావు నీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.స్మార్ట్ సిటీ లో బండి సంజయ్ పాత్ర లేదని బి.అర్.ఎస్ లో ఉన్నప్పుడు విమర్శించిన విషయం సునీల్ రావు మరిచి పోయావా అని గుర్తు చేశారు కరీంనగర్ అభివృద్ధి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి తోనే సాధ్యమైందనీ చెప్పారు. బి.అర్.ఎస్ ప్రభుత్వ హయంలోనే కరీంనగర్ అన్నివిధాల అభివృద్ధి చెందిన విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ గమనించాలనీ కోరారు. 15 నెలల కాలంలో మంత్రిగా పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలి. తమ హయంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎక్కడికక్కడ ఆగిపోయిందనీ అన్నారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక కార్పొరేటర్ లా మాట్లాడారాని చెప్పారు . కెసిఆర్ కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది అన్న విషయం బండి సంజయ్ కు ఎలా తెలిసింది… అందులో పని చేశారా అని అడిగారు.రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందేదుకే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారనీ, బండి సంజయ్ కు దమ్ముంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద మాట్లాడాలనీ మండిపడ్డారు.కెసిఆర్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ కలిసి డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారనీ ఆరోపించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్, నగర విద్యార్థి విభాగం అధ్యక్షులు బొంకూరి మోహన్, యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, పార్టీయూత్ మైనార్టీ అధ్యక్షులు నవాజ్, చేతి చంద్రశేఖర్, ఆరె రవి గౌడ్ జెల్లోజి శ్రీనివాస్, కొత్త అనిల్ కుమార్, రాజేందర్, దుడెల్ల ప్రశాంత్, కర్రే అనిల్, నారదాసు వసంతరావు, మెరుగు శ్రీనివాస్, ఉమాశంకర్, ఒడ్నాల రాజు, సతినేని శ్రీనివాస్, గూడెల్లి రాజ్ కుమార్, మంచి కట్ల కిషోర్ నరసింగరావు, నయీమ్ గంటల రేణుక లుపాల్గొన్నారు.
Read More...
పాలిటిక్స్ 

చెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశం: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

చెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశం: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్, మార్చి 22(భారత శక్తి): చెన్నైలో జరుగుతున్న సమావేశాన్ని దొంగల ముఠా కలయికనీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. ఆ ముఠా కు నాయకత్వం వహించేది డీఎంకే పార్టీని, తమిళనాడులో అధికారంలో ఉన్న వాళ్ళు వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంలో కుకుపోయారని, అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మీడియాతో మంత్రి పై విధంగా స్పందించారు. అనేక అవినీతి, కుంభకోణాల్లో డీఎంకే కూరుకుపోయి, అక్రమ సంపాదన ను కాపాడుకోవడానికి ఈ దొంగల ముఠాలో బి ఆర్ ఎస్ , కాంగ్రెస్, సిపిఎం, ఆఫ్ పార్టీలను డీఎంకే సభ్యులుగా చేర్చుకుందని ఆరోపించారు. ముఠా లో సభ్యులుగా చేరిన బి ఆర్ ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన ఆరోపణలు నిజం చేయకుండా తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారనీ, ప్రజల దారి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయిందనీ, కేసీఆర్ కుటుంబ అవినీతి కేసులను కాంగ్రెస్ నీరుగారుస్తోందనీ ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలపై పోరాడకుండా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్నారు. చెన్నైలో ఆ రెండు పార్టీలు ఒక్కటైనయని, లిక్కర్ దొంగలంతా ఒక్కటయ్యారనీ వ్యాఖ్యానించారు. చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదు… చంబల్ లోయ ముఠా సమావేశమన్నారు. దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాంల నుండి బయటపడే దానిపైనే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదనీ, ఇంతవరకు గైడ్ లైన్స్ వెలువడనే లేదనీ చెప్పారు. ఆలు లేదు..చూలు లేదు..అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ప్రతిపక్షాల పరిస్థితి ఉందన్నారు. దక్షిణాదిలో వికసించేది కమలమేనని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యంమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేననీ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నాకు కేంద్ర మంత్రి బాద్యతలు అప్పగించారనీ చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పై సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మోద్దనీ తెలిపారు. ఆ విషయమై జాతీయ నాయకత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడమే క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తల పనన్నారు. పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను కార్యకర్తలతో కలిసి అనేక పోరాటాలు చేశాననీ, రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందనీ చెప్పారు. కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఇక కల్ల అన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఫాంహౌజ్ లో గడ్డి పీకుతున్నాడనీ ఆరోపించారు.
Read More...
పాలిటిక్స్ 

దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి…దోషలందరి సంగతి తేలుస్తాం

దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి…దోషలందరి సంగతి తేలుస్తాం కరీంనగర్, ఫిబ్రవరి 25(భారత శక్తి): బీజేపీది ఇండియా జట్టయితే పాకిస్తాన్ జట్టు గెలవకున్న సంబురాలు చేసుకునే ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ జట్టని, ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్ లోనూ గెలుపు బీజేపీదే. పాకిస్తాన్ ను చిత్తు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమాని సవాల్ విసిరారు. తాము గతంలోనే సవాల్ చేస్తే సీఎం తోకముడిచిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ గెలిస్తే పట్టభద్రుల, టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. కుల గణనకు మేం వ్యతిరేకం కానేకాదని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకుల కులాలకు రిజర్వేషన్లు అమలుకు మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదని చెప్పారు. నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్టకొడతారా?. ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలి. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 56 శాతం జనాభా ఉందని నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ అసెంబ్లీలో చెబితే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారని, మీరు వాళ్లను అరెస్ట్ చేయకుండా పారిపోయేలా చేసిందే కాంగ్రెస్. మీరు విదేశాలకు పంపిస్తే మేం పట్టుకురావాలా? కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసులు చెప్పిన తరువాత కూడా ఆయనకు కనీసం నోటీసు కూడా ఎందుకియ్యలేదని ఆరోపించారు. యమునా, గంగా, సబర్మతి ప్రక్షాళనకు అతి తక్కువ ఖర్చుతో చేశారని, కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనను రూ.1.5 లక్షలకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రెవిన్యూలో అత్యధిక షేర్ హైదరాబాద్ దే…. కానీ ఆదిలాబాద్, ములుగు వంటి వెనుకబడిన జిల్లాలకు అధిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది? అట్లని హైదరాబాద్ కు అన్యాయం చేసిందని అనుకోవాలా? అని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అంటే రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా వరి వేయుద్దు.వేస్తే నష్టపోతారని రైతులను హెచ్చరిస్తున్నారు. మీకు, బీఆర్ఎస్ పాలనకు తేడా ఏముంది? ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డా నీటి కటకట ఎందుకొచ్చింది? మీ అసమర్ధత, పొరుగు రాష్ట్రానికి నీటిని దోచిపెట్టడంవల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, మాజీ మేయర్ వై. సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జే. సంగప్పలు పాల్గొన్నారు.
Read More...
పాలిటిక్స్ 

రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర మంత్రుల పాత్ర ఏమిటో చెప్పాలి: టిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర మంత్రుల పాత్ర ఏమిటో చెప్పాలి: టిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్, ఫిబ్రవరి 25(భారత శక్తి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ వి దిగజారుడు వాఖ్యలు అని, తనకు ఓటేసిన మిత్రులు బాధపడుతున్నారని, ప్రతి ఎన్నికల్లో ఇండియా అంటే బిజెపి అని, పాకిస్థాన్ కాంగ్రెస్ అని పార్టీలను కలపడం అవగాహన రాహిత్యానికి అద్ధంపడుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎంపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ బిడ్డ గా సంజయ్ కు కేంద్రంలో స్ధానం రావడం మాకు సంతోషంమే కానీ కేంద్ర మంత్రిగా కొనసాగుతూ అర్ధ రహితమైన ఆరోపణలు చేయడం సరికాదని సిఎం పై చేసిన వాఖ్యలు ఖండించారు. ప్రతి అంశంలో భారతదేశాన్ని పాకిస్తాన్ ను హిందువు ముస్లిం లను ముడిపెట్టడం, ఏ ఎన్నికలైన సరే మత విద్వేషాలు రెచ్చగొట్టడం సంజయ్ కు పరిపాటిగా మారిందని, మతాల మధ్య చిచ్చుపెట్టే ధోరణి విడాలని, అది తనకు మంచిదన్నారు. దుబాయ్ లో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ గెలువడాన్ని హర్శిస్తున్నమని చెప్పారు. ఇండియా పాకిస్థాన్ పై గెలిస్తే అదేదో బీజేపీ గెలిపించినట్టు క్రికెట్ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సిగ్గుచేటన్నారు. పట్టభద్రుల ఎన్నికలు రాష్ట్ర స్థితిగతులు రాష్ట్ర అంశాలను అవగాహనతో ఓటు వేసే అంశం అని దానికి క్రికెట్ కు ముడిపెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల పదేళ్లుగా చీకటి లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడిందనీ దానికి ఈ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిని నిలపకుండ బీజేపీ కి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సోమవారం ఉమ్మడి నిజామాబాద్ ,కరీంనగర్ లో జరిగిన సమావేశాలు విజయవంతం కావడంతో బీజీపీ పార్టీకి దిమ్మతిరిగి ఓటమి బయంతో కారుకూతలు కుస్తున్నారని ధ్వజమెత్తారు. ::ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు ఖాయం:: ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు ఖాయం అయిందని, ఈ విజయాన్ని ఎవరు ఆపలేరని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వం లో తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు మీరు పది సంవత్సరాల్లో చేసిన దానిపై చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. ఒక సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మీరు 10 ఏళ్లలో 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని బిజెపి కా ఓట్లు వేసేది ఆలోచించి ఓటును నరేందర్ రెడ్డికి వేయాలని కోరారు.ప్రజలు విజ్ఞత తో ఆలోచించి ఓటు కరాబు చేసుకుంటా ఓటు వేయాలని సూచించారు. కేటీఆర్ ఫార్ములా ఈ రేసు అవినీతి పై అంశం పై బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదు. అనడం సరికాదన్నారు. స్వతంత్ర భారతదేశంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కుల గణన సర్వే చేశామని, సమగ్ర కుటుంబ సర్వే ఆఫీసియల్ కాదు. ఆది ఒక్క రోజులో చేసిన తప్పుల తడక అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 56 శాతం బీసీ లు ఉన్నట్లు చూపెట్టామని చెప్పారు. మంత్రి బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకోకుండా వ్యాఖ్యానిస్తున్నా రని వాటిని ఖండించారు. కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు లాంటి వారికి కూడా 28 వరకు అవకాశం ఇస్తున్నామని సహకరించాలని కోరారు. గుజరాత్ గురించి మాట్లాడే బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడు ఎందుకు అభివృద్ధికి ఏమి చేసినావో, ఏమి తెచ్చావో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు, అలాగే బండి సంజయ్,కిషన్ రెడ్డి కేంద్రం నుండి రావాల్సిన నిధులు ,మెట్రో రైల్ నిధులు , ఫోర్త్ సిటీ, బడ్జెట్ లో అన్యాయం జరుగుతుంటే ఒక్కసారైనా మాట్లాడారా…? ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారనీ మండిపడ్డారు. అడుగడుగున మత రాజకీయాలు చేస్తూ ఓట్లు అడగడమేనా, బండి సంజయ్,కిషన్ రెడ్డి లు రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి? చెప్పాలని కోరారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కుల సర్వే చేసి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పుతే ఓర్వలేక అసత్యపు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.బీసీ ను అధ్యక్ష పదవి నుండి తొలగించి కిషన్ రెడ్డి నీ చేస్తే బీసీ లకు అన్యాయం జరగలేదా.అని నిలదీశారు. దానిపై బీజేపీ ఎందుకు సమాధానం చెప్పలేదని, అప్పుడు ఎక్కడ పోయింది సిద్ధాంతమని విరుచుకుపడ్డారు. రెడ్డి ముఖ్యమంత్రి అయిన బీసీ కుల గణన చేసి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధం చేస్తుండడం హర్షించదగినదా కదా అని మండిపడ్డారు. బీసీ లను అణగదొక్కుతున్న బీజేపీ కి ఓటేస్తారా…? బీసీ లకు సర్వం చేస్తున్న కాంగ్రెస్ కి ఓటేస్తారా పట్టభద్రులు ఆలోచించాలని కోరారు. సోషల్ మీడియా లో అనైతికంగా అబద్ధపు ప్రచారానికి ,వీడియోలను మార్ఫింగ్ చేయడానికి బీజేపీ విచ్చలవిడగ వాడుతుందని, ప్రజలు గమనించి, బి ఆర్ ఎస్ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు పట్టభద్రులు గమనించాలి.. ఎవరికి సహాయానికి చేయడానికి అభ్యర్థిని పెట్టలేదని చెప్పారు. పట్టభద్రులు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మంచి మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ, అయిల్ పేడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు బొమ్మ శ్రీరామ్, ఏంది తాజ్, విర దేవేందర్ లు పాల్గొన్నారు.
Read More...
పాలిటిక్స్ 

కాంగ్రెస్ లోనే కోనేరు కోనప్ప! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కోనేరు కోనప్ప

కాంగ్రెస్ లోనే కోనేరు కోనప్ప! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కోనేరు కోనప్ప భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 22: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెనక్కితగ్గారు. కోనప్పను సీఎం రేవంత్ రెడ్డి పిలిచి చర్చించి పలు హామీలు ఇవ్వడంతో నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సీఎంతో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. అయితే నిన్న కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రకటించిన కోనప్ప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్నహరికృష్ణ(బి ఎస్ పి)కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఖండించి చివరి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని తెలిపారు.
Read More...
పాలిటిక్స్ 

ఎమ్మెల్సీ ఎన్నికలకు 15 నామినేషన్లు దాఖలు కరీంనగర్

ఎమ్మెల్సీ ఎన్నికలకు 15 నామినేషన్లు దాఖలు కరీంనగర్ కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి): మెదక్, నిజామాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది నామినేషన్ వేయగా, టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. ::పట్టభద్రుల స్థానం:: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన లంటు చంద్రశేఖర్ నామినేషన్ వేయగా, కరీంనగర్ లోని విద్యానగర్ కు చెందిన యాదగిరి శేఖర్ రావు తరఫున పచ్చునూరి సురేందర్ నామినేషన్ దాఖలు చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ కు చెందిన అబ్బగోని అశోక్ గౌడ్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన దేవతి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పెరుందేవి గూడేనికి రైకల సైదులు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండం పల్లికి చెందిన గుయ్య సాయి కృష్ణమూర్తి, కరీంనగర్ నగరానికి చెందిన ఎడ్ల సాయి కృష్ణప్రియ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్లు దాఖలు చేశారు.సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దొడ్ల వెంకటేశం, మంచిర్యాల జిల్లా తిరుమలగిరి కాలనీకి చెందిన కొమిరెడ్డి మహేష్, నిజామాబాద్ కు చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొసునూరు పల్లికి చెందిన వేముల విక్రమ్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ కి నామినేషన్ వేశారు. ::ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి:: మెదక్ జిల్లా టేకుమల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్ రెడ్డి, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన మల్కా కొమురయ్య, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం న్యూ మల్కాపూర్ కు చెందిన వై. అశోక్ కుమార్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ వేసిన ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడాకు చెందిన మంచి కట్ల ఆశమ్మ మరో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇదివరకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడేనికి చెందిన కంటే సాయన్న మరో సెట్ నామినేషన్ సమర్పించారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరి శ్రీకాంత్ మరో సెట్ నామినేషన్ అందజేశారు. ఇప్పటివరకు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కలిపి మొత్తం 28 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో 21 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి, ఏడుగురు టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేశారు.
Read More...
పాలిటిక్స్ 

బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా విపుల్ జైన్

బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా విపుల్ జైన్ (భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 04: కామారెడ్డి పట్టణానికి చెందిన విపుల్ జైన్ కి సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విడుదల చేసిన స్టేట్ కౌన్సిల్ సభ్యుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విపుల్ జైన్ గతంలో బీజేపీ కామారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడుగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా భాద్యతలు నిర్వహించారు. తనపై నమ్మకంతో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా నియామకానికి సహకరించిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ విస్తరణకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.
Read More...
పాలిటిక్స్ 

కూటమిలో బీజేపీ లెక్కేంటీ

కూటమిలో బీజేపీ లెక్కేంటీ విజయవాడ, డిసెంబర్‌ 7 తెలంగాణలో జనసేన చవిచూసిన దారుణ ఓటమి ఏపీలో ప్రభావం చూపుతుందా? కచ్చితంగా కొంత డ్యామేజ్‌ అయితే ఉంటుంది. తెలంగాణలో జనసేన పోటీ చేయడం ఇదే మొదటిసారి. 8 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీట్లో కూడా గెలవలేదు. కనీసం డిపాజిట్లు దక్కలేదు. 8 మంది అభ్యర్ధులకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే 59వేలు మాత్రమే. అది కూడా బీజేపీతో పొత్తులో ఉండి. పోనీ, జనసేన వల్ల బీజేపీకి ఏమైనా లాభం జరిగిందా అంటే.. అదేం లేదు. గ్రేటర్‌లో బలం ఉందనుకున్న పార్టీకి కేవలం ఒకే ఒక్క సీటు వచ్చింది. ఓవరాల్‌గా జనసేన ఓట్లు బీజేపీకి వెళ్లలేదు, బీజేపీ ఓట్లు జనసేనకు రాలేదు. పేరుకే పొత్తు తప్ప రెండు పార్టీల మధ్య ఓట్‌ షేరింగ్‌ జరగనేలేదని అర్ధం. టీడీపీతో జరిపే సీట్ల చర్చలో తెలంగాణ ఓటమి కచ్చితమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు కొందరు. ఎందుకంటే.. పవన్‌ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనేది జనసేన కార్యకర్తల ఆరాటం. కాని, సంస్థాగతంగా తమ బలం ఎంత అన్నది అభిమానులు, కార్యకర్తలు ఆలోచించడం లేదు. పవన్‌ను చూసుకుని పార్టీ చాలా బలంగా ఉందని చెప్పుకోవడం తప్ప ఆ అభిమానం ఓట్లుగా మారవు అని గత ఎన్నికల్లోనే అర్థమైంది. నిజానికి తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే రిఫ్లెక్ట్‌ అయింది. తెలంగాణలో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్‌ ఉందని ఆ పార్టీ చెప్పుకుంది. ఆ బలం చూసుకునే ఎన్నికలకు ఒంటరిగా వెళ్తామని మొదట ప్రకటించింది కూడా. తెలంగాణలో 32 సీట్లలో పోటీకి రెడీ అయింది. చివరికి 8 సీట్లలోనే పోటీ చేసింది. కాని, ఆనాడు జనసేన చెప్పిందేంటంటే.. కనీసం 25 అసెంబ్లీ స్థానాల్లో బలమైన ఓటు బ్యాంక్‌ తమ సొంతం అని. కాని, ఎన్నికల ఫలితాలు చూస్తే.. 8 మంది పోటీ చేసినా అందరికీ కలిపి 60వేల ఓట్లు కూడా రాలేదు. అంటే, మాటలు, ప్రకటనల్లో మాత్రమే జనసేనకు బలం తప్ప.. వాస్తవానికి ఆ పార్టీ పరిస్థితి ఏంటో గణాంకాలే చెబుతున్నాయి. రేప్పొద్దున టీడీపీతో సీట్ల గురించి చర్చించేటప్పుడు కూడా ఈ టాపిక్‌ రాకుండా ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. జనసేనకు మహా అయితే ఓ పాతిక సీట్లు ఇస్తారనే చర్చ జరిగినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీపై మండిపడ్డారు. అందుకే, పవన్‌ కల్యాణ్‌ కూడా గౌరవప్రదమైన సీట్లు అడుగుతాం అన్నారు. చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు.. ముందు వెనక ఆలోచించకుండా పొత్తుకు రెడీ అని ప్రకటించడంతో జనసేనపై టీడీపీలో సానుభూతి పెరిగింది. కష్ట సమయంలో తమకు తోడుగా ఉన్నారు కాబట్టి మరో పది సీట్లు ఎక్కువ ఇచ్చినా ఫర్వాలేదనే ఆలోచన టీడీపీ కార్యకర్తల్లో వచ్చింది. కాకపోతే, అలాంటి సమయంలో తెలంగాణలో పోటీ చేయడం, దారుణంగా దెబ్బతినడంతో.. బేరం మళ్లీ పది సీట్ల నుంచి గానీ మొదలవుతుందా అనే చర్చ జరుగుతోంది.సరే.. సీట్ల షేరింగ్‌ రెండు పార్టీల మధ్య జరిగే అవగాహనను బట్టి ఉంటుంది. కాని, తెలంగాణలో జనసేన ఓటమిని అధికార పక్షం అంత తేలిగ్గా వదులుతుందా? కచ్చితంగా వదలదు. ఆయన రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేదు, తెలంగాణలోనూ అభ్యర్ధులను గెలిపించుకోలేదు అనే విమర్శ వస్తుంది. దీనికి జనసేన సిద్ధపడాల్సి ఉంటుంది. అయితే, బీజేపీ మాత్రం ఏ రాష్ట్ర పరిస్థితులు దానివే అంటోంది. తెలంగాణలో ఆదరించకపోయినంత మాత్రాన.. అదే సెంటిమెంట్‌ ఏపీలోనూ రిపీట్‌ అవుతుందని చెప్పలేం అంటోంది బీజేపీ.తెలంగాణలో జనసేన ఓటమి ఏపీలో పెద్దగా ప్రభావం చూపించదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా. ఎందుకంటే, తెలంగాణలో పవన్‌ కల్యాణ్‌ పెద్దగా ప్రచారం చేసింది లేదు. అంత ఎఫర్ట్‌ కూడా చూపించలేదు. తెలంగాణలో తమ పార్టీ బలం ఏంటో తెలుసు కాబట్టే పవన్‌ చివరి నాలుగు రోజులు మినహా ప్రచారానికి వెళ్లలేదని అందరికీ తెలుసు. సో, తెలంగాణలో ఓటమిని ఏపీలో పట్టించుకోకపోవచ్చు అనేది ఓ అంచనా. అటు టీడీపీ కూడా ఓటమిని సాకుగా చూసే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిని టీడీపీ అసలు కన్సిడర్‌ చేయకపోవచ్చు. ఎందుకంటే, ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణమే వేరు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేదే రెండు పార్టీల లక్ష్యం. సో, సీట్ల విషయంలో అంతకు ముందు ఏ ఒపీనియన్‌తో ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉండొచ్చు. పైగా రెండు పార్టీల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న గొడవలను కూడా పెద్దగా లెక్కచేసే పరిస్థితిలో లేరు. 175 నియోజకవర్గాల్లో ఒకట్రెండు చోట్ల అసంతృప్తులు రగిలినా పెద్దగా పట్టించుకునే పరిస్థితిలో లేవు టీడీపీ అండ్‌ జనసేన. పైగా ఈమధ్యే పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారిని వైసీపీ కోవర్టులుగానే చూస్తామని చెప్పేశారు. సో, ఏపీలో టీడీపీ`జనసేన పొత్తు ఎట్టిపరిస్థితుల్లో వీగిపోదనే చెప్పాలి.ఇక్కడ పొత్తు విషయం గురించి కూడా ఓసారి మాట్లాడుకోవాలి. బీజేపీ`జనసేన బంధం తెలంగాణ వరకేనా.. ఏపీలో కూడా కొనసాగుతుందా? ఆమాటకొస్తే.. జనసేన బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూడలేదు. బీజేపీనే పొత్తు కోసం జనసేన దగ్గరికి వెళ్లింది. తెలంగాణలో ఒంటరి పోరుకు వెళ్తున్నాం, 32 సీట్లలో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నామని చెప్పిన తరువాత బీజేపీ అలర్ట్‌ అయింది. రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో.. బీజేపీ కోసం జనసేననే ఓ మెట్టు తగ్గి 8 సీట్లకు పోటీ చేసింది. జాగ్రత్తగా పరిశీలిస్తే.. జనసేన బీజేపీతోనే ఉంది అని చెప్పుకోడానికి కూడా లేదు. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే.. మళ్లీ చంద్రబాబుతో సమావేశమయ్యారు పవన్‌ కల్యాణ్‌. పొత్తులో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు తలమునకలయ్యారు. అంటే, పొత్తు తెలంగాణ వరకే అని చెప్పకనే చెప్పినట్టైంది. పైగా బీజేపీనే తమతో కలిసిరావాలి గానీ.. తాము పొత్తు కోసం బీజేపీ దగ్గరకు వెళ్లబోం అనే సంకేతం కూడా పంపినట్టైంది. ఆల్రడీ తెలంగాణలో జరిగింది అదే. సో, ఏపీలో కూడా బీజేపీనే కాస్త తగ్గి జనసేన దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. బీజేపీ మాత్రం తమ నిజమైన మిత్రుడు జనసేననే అని చెప్పుకుంటోంది. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందని విమర్శిస్తోంది బీజేపీ. నిజంగా టీడీపీ`జనసేన పొత్తులో ఉంటే.. తెలంగాణలో తమతో ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నిస్తున్నారు.బీజేపీ నేతలు విమర్శిస్తున్నట్టుగా టీడీపీ`జనసేన మధ్య పొత్తులో ఎలాంటి పొరపొచ్చాలు లేవు. టీడీపీ`జనసేన ఫుల్‌ క్లారిటీతో ఉన్నాయి. ఏపీలో రెండు పార్టీలు ఎలా సహకరించుకుని ముందుకు వెళ్లాలనే దానిపైనే కసరత్తు చేస్తున్నాయి. పైగా రెండు పార్టీల మధ్య ఓట్‌ షేరింగ్‌ గురించి కూడా గట్టి చర్చే జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ 90 శాతం ఓట్ల షేరింగ్‌ జరగాల్సిందేననేది రెండు పార్టీల టార్గెట్‌. తెలంగాణలో అదే మిస్‌ అయింది. పేరుకే పొత్తు తప్ప బీజేపీ`జనసేన మధ్య ఓట్‌ షేర్‌ జరగలేదని చెబుతున్నారు. ఒకవేళ అలా జరిగి ఉంటే.. కూకట్‌పల్లి నుంచి జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్ధికి డిపాజిట్‌ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో జనసేనకంటే బీజేపీకే కొంత బలం ఉందని అందరికీ తెలుసు. అయినా సరే డిపాజిట్‌ రాలేదంటే.. రెండు పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు జరగలేదనే అర్థం. సో, ఏపీలో ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు అండ్‌ పవన్‌. పేరుకు మాత్రం పొత్తు పెట్టుకుని, క్షేత్రస్థాయిలో అటు ఓట్లు ఇటు, ఇటు ఓట్లు అటు పడకపోతే మొదటికే మోసం వస్తుంది. చంద్రబాబు`పవన్‌ కలిస్తే సరిపోదు. గ్రామస్థాయిలో కార్యకర్తలు కలిసి పనిచేయాలి. అలా జరిగినప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతుంది. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య ఇంకాస్త కసరత్తు జరగాల్సి ఉంది.ఓవైపు ఇన్నిసార్లు సమావేశమై చర్చిస్తున్నా.. టీడీపీ`జనసేన మధ్య కొన్ని వ్యవహారాలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. అలాంటిది ఎన్నికలకు ఒకట్రెండు నెలల ముందు బీజేపీ పొత్తులోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. అసలు, ఆ టైమ్‌కి బీజేపీకి స్పేస్‌ ఉంటుందా? రెండు పార్టీలు ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో రెడీ చేసుకున్నాయి. రేప్పొద్దున సీట్లు పంపిణీ కూడా చకచకా జరిగిపోతుంది. అలాంటిది చివరి నిమిషంలో బీజేపీ వచ్చి చేరితే.. సీట్ల పంపిణీ జరిగేనా? సో, ఓవరాల్‌గా ఇక్కడ తొందరపడాల్సింది బీజేపీనే. పొత్తుకు దూరంగా ఉండదలచుకుంటే.. ఇప్పటి నుంచే కార్యాచరణ రెడీ చేసుకోవాలి. లేదు.. పొత్తులో చేరతాం అన్నా కూడా ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాలి. రోజులు, వారాలు గడుస్తున్న కొద్దీ టీడీపీ`జనసేనకు బీజేపీ దూరం కావాల్సి వస్తుంది. ఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేంటంటే.. తెలంగాణలో జనసేన`బీజేపీ పొత్తు అక్కడి వరకే. ఏపీలో యథావిధిగా టీడీపీ`జనసేన మధ్య పొత్తు నడుస్తుంది. సో, కలిసి వెళ్లాలా వద్దా అని ఆలోచించుకోవాల్సిందల్లా బీజేపీనే.
Read More...
పాలిటిక్స్ 

వివాదాలు…కేసులు.

వివాదాలు…కేసులు. మహబూబ్‌ నగర్‌, డిసెంబర్‌ 4 టైగర్‌ అని దగ్గరివాళ్లు ప్రేమగా పిలుచుకునే అనుముల రేవంత్‌ రెడ్డి రాజకీయాలూ అంతే. దూకుడైన స్వభావం.. పదునైన మాటలతో రాజకీయరంగంలోకి దూసుకొచ్చిన నేటితరం నేత రేవంత్‌ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో వేగంగా ఎదిగిన నేతగా ఆయన. ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ ను దూకుడుగా ఎదుర్కొన్న నేత రేవంత్‌ రెడ్డి. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ పీసీసీ చీఫ్‌ గా రేవంత్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది.రేవంత్‌ రెడ్డి రాజకీయ జీవితం విద్యార్థి నేతగా ప్రారంభమైంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌ గా ఉన్నప్పటికీ తెలంగాణలోని బీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. విద్యార్థి జీవితంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో ఆయన సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2001`2002 మధ్య కాలంలో టీఆర్‌ఎస్‌లో పని చేశారు. 2004లో కల్వకుర్తి నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించినా ఆయనకు నిరాశే ఎదురైంది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిడ్జిల్‌ మండలం నుంచి ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఎన్నికల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2007లోను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రేవంత్‌ రెడ్డిలోని చురుకుదనం చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్‌… కాంగ్రెస్‌ నుంచి అప్పటికే ఐదుసార్లు గెలిచిన గుర్నాథరెడ్డిని ఓడిరచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లోనూ మరోసారి గెలిచి టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ అయ్యారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, మారిన రాజకీయ పరిణామాల వల్ల క్రమంగా టీడీపీ ఇక్కడ ఉనికి కోల్పోయే పరిస్థితులు ఏర్పడటంతో మరోసారి ఆ పార్టీని వదిలి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.2017 అక్టోబర్‌ 31న కాంగ్రెస్‌ లో చేరిన రేవంత్‌ రెడ్డి.. 2018 ఎన్నికల్లో కొండంగల్‌ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. యాక్టివ్‌ పాలిటిక్స్‌ లోకి వచ్చాక రేవంత్‌ రెడ్డికి ఇది తొలి ఓటమిగా చెప్పవచ్చు. ఆ తర్వాత 2018 సెప్టెంబర్‌ 20న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ముగ్గురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమిస్తూ కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. ఆ ముగ్గురిలో రేవంత్‌ ఒకరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోకుండా ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ నుంచి బరిలో దిగి పది వేల ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డిపై విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు రేవంత్‌ రెడ్డి. 2021 జులైలో రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీ చీఫ్‌ గా నియమించింది.ఎన్నికల కమిషన్‌ కు సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం రేవంత్‌ రెడ్డిపై 89 కేసులున్నాయి. అందులో ముఖ్యమైంది ఓటుకు నోటు కేసు. 2015 మే 31న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడానికి నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌కు లంచం ఇచ్చారనే ఆరోపణలపై రేవంత్‌ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్‌ చేసింది. ఇందులో చంద్రబాబు పాత్రపైనా ఆరోపణలొచ్చాయి. తనపై అన్యాయంగా, దురుసుగా ప్రవర్తించిన పోలీసుల పేర్లను డైరీలో రాసుకుంటా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టను అని ఓ సందర్భంలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.మహబూబ్‌ నగర్‌ జిల్లా (ప్రస్తుతం నాగర్‌ కర్నూల్‌ జిల్లా) కొండారెడ్డి పల్లిలో 1969 నవంబర్‌ 8న రేవంత్‌ రెడ్డి జన్మించారు. నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మలు ఆయన తల్లిదండ్రులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తి చేశారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి మేన కోడలు గీతను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె.
Read More...
పాలిటిక్స్ 

ఆపరేషన్‌ ఆపొజిషన్‌…

ఆపరేషన్‌ ఆపొజిషన్‌… విజయవాడ, నవంబర్‌ 28 ఏపీలో ఎన్నికల లెక్కలు మారుతున్నాయి. తెలంగాణ ఫలితాలు వెల్లడి తరువాత ఇక ఏపీలో రాజకీయం వేడెక్కనుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. తెలంగాణలో బీజేపీకి మిత్రపక్షంగా ఎన్నికల బరిలోకి దిగిన పవన్‌.. ఏపీలో తమ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నిర్ణయం ఏంటనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఢల్లీి పరిణామాలపైన స్పష్టతతో ఉన్న జగన్‌ తన మార్క్‌ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఏపీలో నయా సవిూకరణాలు:తెలంగాణ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3న వెల్లడి కానున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో ఎన్నికల రాజకీయం రాజుకోనుంది. ఏపీలో టీడీపీతో జత కట్టిన పవన్‌ కల్యాణ్‌..తెలంగాణలో బీజేపీ తో ముందుకు వెళ్తున్నారు. అక్కడ టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో, ఏపీ మూలాలు ఉండి తెలంగాణలో స్థిర పడిన ఓటర్లు బీజేపీ ` జనసేనకు మద్దతిస్తారని కమలం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ, అక్కడ టీడీపీ మద్దతు దారులు నేరుగా ప్రియాంక ర్యాలీల్లో పార్టీ జెండాలతో హాజరు కావటం…ఖమ్మం వంటి జిల్లాల్లో టీడీపీ నేతలు కాంగ్రెస్‌ కు మద్దతు ప్రకటించటంతో కొత్త లెక్కలు తెర విూదకు వస్తున్నాయి. ఇక, తెలంగాణలో పవన్‌ ఏ స్థాయిలో సహకరించారనేది కౌంటింగ్‌ తో స్పష్టం కానుంది. ఏపీలో బీజేపీ మద్దతు పొందేందుకే తెలంగాణలో కాషాయం పార్టీకి వపన్‌ సహకరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ,ఆ లెక్కే ఏపీలో ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తో పొత్తు విషయంలో చంద్రబాబు, పవన్‌ సానుకూలంగా ఉన్న టీడీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి దాదాపు 40`45 సీట్లు కేటాయించాల్సిన పరిస్థితులు ఉంటాయని..అది వైసీపీతో హోరా హోరీగా జరిగే పోరులో తమకు నష్టం చేస్తుందనేది టీడీపీ నేతల అంచనా. అదే సమయంలో అసలు బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. చంద్రబాబు అరెస్ట్‌ తరువాత బీజేపీ ఢల్లీి నాయకత్వం గుంభనంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో టీడీపీ కేడర్‌ కాంగ్రెస్‌ కు సహకరిస్తున్న అంశం బీజేపీ పైన ప్రభావం చూపించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.ఇక, ఇటు చంద్రబాబు కేసుల చక్రబంధంలో చిక్కుకున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే సమయం ఉంది. పొత్తులు, సీట్లు..మేనిఫెస్టో, సర్దుబాట్లు..అన్ని వ్యవహారాలను చక్కదిద్దుకోవాల్సిన వేళ కేసులు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అటు జగన్‌ అభ్యర్దుల కసరత్తు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీలో వేసే అడుగులు పైన తమకు క్లియర్‌ సమాచారం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. సంక్షేమం చుట్టూ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు తిరుగుతున్న వేళ..ఏపీలో ఇదే సంక్షేమ ఓట్‌ బ్యాంక్‌..అదే పాజిటివ్‌ ఓటింగ్‌ నమ్ముకున్న జగన్‌ ప్రతిపక్షాల పైన పై చేయి సాధించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా వచ్చే మూడు నెలల కాలంలో సంక్షేమ క్యాలెండర్‌ ను ఇప్పటికే ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఆపరేషన్‌ అపోజీషన్‌ ద్వారా ఆత్మరక్షణలోకి నెట్టేలా జగన్‌ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రజల్లో ఇప్పటికే వైసీపీ నేతలు ఉండగా.. టీడీపీ, జనసేన అసలు ఎన్నికల సంసిద్దత ప్రారంభించలేదు. దీంతో..జగన్‌ తాను నమ్ముకున్న విన్నింగ్‌ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు.
Read More...
పాలిటిక్స్  తాజా వార్తలు 

మద్యం, ఇసుక, కరెంట్‌

మద్యం, ఇసుక, కరెంట్‌ గుంటూరు, నవంబర్‌ 25 రానున్న ఎన్నికల్లో మద్యం, ఇసుక, కరెంటు చార్జీలే అజెండా అవుతాయా..? ప్రస్తుతం విపక్షాలన్నీ ఈ మూడు అంశాలపైనే దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని వైసీపీ హావిూనిచ్చింది. అధికారానికి వచ్చాక ప్రభుత్వమే మద్యం వ్యాపారం మొదలు పెట్టింది. హావిూని గాలికి వదిలేసింది. టీడీపీ హయాంలో ఉచితంగా లభించిన ఇసుక ఇప్పుడు మరింత ప్రియమైంది. భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇక నిరంతరం పెరుగుతున్న కరెంటు చార్జీలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే ఈ మూడు అంశాలను ఎన్నికల్లో అజెండా చేసేందుకు ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. వీటిపై అధికార పార్టీ దీటుగా సమాధానం చెప్పగలదా! ఢఫిెన్స్‌లో పడుతుందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.నాడు ప్రజా సంకల్పయాత్రలో వైసీపీ అధినేత వైఎస్జగన్దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తామని హావిూనిచ్చారు. పేద కుటుంబాలు గుల్లవుతుంది మద్యంతోనే అని చెప్పుకొచ్చారు. మహిళల తాళిబొట్లు తెంచుతున్న మద్యం మహమ్మారి అంతు చూస్తామన్నారు. మద్యాన్ని కేవలం స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామన్నారు. అధికారానికి వచ్చాక ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెర లేపింది. ధరలు రెట్టింపు చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాలను మరింత ఛిద్రం చేసింది. ధరలు పెంచినా మద్యం తాగడం మానుకోరని ప్రభుత్వానికి తెలుసు. ప్రతి కుటుంబ ఖర్చులో మద్యం వాటా మరింతగా పెరిగింది. సగటు ప్రజల ఆదాయం పెరగకున్నా మద్యం ఖర్చు పెరగడంతో అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల మద్యం వ్యాపారంపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. మద్యం తాగేవారి సంఖ్య జాతీయ సగటు 18 శాతమైతే రాష్ట్రంలో 24 శాతం ఉన్నట్లు వెల్లడిరచారు. ఏటా బడ్జెట్లో మద్యం రాబడి అంచనా సుమారు రూ.20 వేల కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. వాస్తవ లెక్కలు చూస్తే సుమారు రూ.50 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో సుమారు లక్ష కోట్లకు పైగా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరినట్లు పురందేశ్వరి లెక్కలేసి చెప్పారు. నాణ్యత లేని చీప్లిక్కర్తాగి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని ఆమె కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు.ఇసుకలోనూ ప్రభుత్వం ప్రజల జేబులు కొట్టేస్తున్నట్లు అన్ని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. దొడ్డిదారిన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్రాక్టరు ఇసుక సుమారు రూ. 6 వేల ధర పలుకుతోంది. అంత ఖర్చుతో నిర్మాణాలు చేపట్టలేక భవన నిర్మాణ రంగం కుప్పకూలింది. పనుల్లేక కార్మికులు వలసబాట పట్టాల్సి వస్తోంది. ఇసుక తవ్వకాలను నిలిపేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదంటూ విపక్షాల నేతలు ప్రభుత్వాన్ని దునుమాడుతున్నారు.ఇవిచాలవన్నట్లు కరెంటు చార్జీలు ప్రతి నెలా మోతెక్కిస్తున్నాయి. తాము అధికారానికి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తామన్న వైసీపీ హావిూని అటకెక్కించింది. తగ్గించకపోగా భారీగా పెంచుకుంటూ వెళ్తోంది. ఈ మూడు అంశాలు ఎన్నికల్లో విపక్షాల అజెండా అయితే వైసీపీ ఎలా సమర్థించుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వీటిపై ప్రజలు దృష్టి పెట్టకుండా దారి మళ్లిస్తారా..? మరేం చేస్తారనే దానిపై విశ్లేషకులు సైతం కుస్తీ పడుతున్నారు.
Read More...