చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్రప్రసాద్.
తిరుపతి జిల్లా ప్రతి నిధి /విజయవాడ, జూలై 15 (భారతశక్తి) : సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గురునాథరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని, వారికి అమలైన పథకాలు గురించి రాజేంద్రప్రసాద్ వివరించారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పి ఇంటికి ఒకరికి మాత్రమే, అది కూడా కొంతమందికే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని, కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి కూడా డబ్బులు వేస్తామని గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ ఇంట్లో ఇద్దరు ఉన్న, ముగ్గురు ఉన్నా, నలుగురు ఉన్నా కూడా అందరికీ తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా 13వ వార్డు తెలుగుదేశం నాయకులు రాజేంద్రప్రసాద్ శాలువా కప్పి సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి కూనపరెడ్డి శ్రీనివాసు,మాజీ ఛైర్మన్లు జంపాన పూల, కుద్దుస్, 13వ వార్డు కౌన్సిలర్ పైలా శ్రీనివాస్, పదవ వార్డు కౌన్సిలర్ పల్యాల శ్రీను,14 వార్డ్ కౌన్సిలర్ కోరాడ వెంకటలక్ష్మి,3 వార్డు కౌన్సిలర్ తెనాలి పద్మావతి, 13 వార్డు అధ్యక్షులు మీసాల అప్పలనాయుడు, లంక అప్పల నాయుడు ,పైడియ్య, అనిల్, సగర సాధికార కన్వీనర్ జంపన శ్రీనివాస్, మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి, చేదుర్తి పాటి ప్రవీణ్, 4 వార్డ్ అధ్యక్షులు సాంబశివరావు, శివాలయం చైర్మన్ కుటుంబరావు, వైద్యశాల చైర్మెన్ మండవ జయదేవ్, పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్,రత్నం బుజ్జి, వీరంకి చింతయ్య,నజీర్,పుట్టి చంటి, సీనియర్ నాయకులు, మీసాల అప్పల నాయుడు, యూనిట్ ఇంచార్జ్ చలపాటి శ్రీను, జంపన నరసింహారావు ,పైడియ్య,వెంట్రప్రగడ వీరాంజనేయులు, కోడె హరీష్, చిట్టిమోతల సుబ్బారావు,చిట్టి,గఫూర్, సాంబశివరావు,అనిల్ సజిత్, జన సేన నాయకులు గిరిడి వెంకటేష్, అమరాపు సాంబశివరావు, సిగటాపు దుర్గా ప్రసాద్, శివ సాయి, వెంకటేష్, ఇంకా వార్డులోని పలువురు నాయకులు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.