కాంగ్రెస్ విధించిన ఎమెర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయానికి – 50 సంవత్సరాలు
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 27: కాంగ్రెస్ విధించిన ఎమెర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయానికి – 50 సంవత్సరాలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నాడు జరిగిన ఆక్రందనల దృశ్యమాలిక ఎగ్జిబీషన్ నిర్వహించి అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన కామారెడ్డి జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ గ్రహణం స్వాతంత్య్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయం అని, ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించిన తీరు అత్యంత దౌర్భాగ్యం అని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ 21 నెలల పాటు సాగిన నియంతృత్వ, నిరంకుశ ప్రభుత్వ నిర్బంధాలను ఎదిరించి ప్రజాస్వామ్య పరిరక్షణకై పాటుపడిన వీరులందరికీ జోహార్లు అని అన్నారు. దేశంలో ఇందిరాగాంధీ నియంత పాలనలో విధించిన ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు పూర్తి అయ్యాయనీ అన్నారు. అతిథిగా విచ్చేసిన బీజేపీ గిరిజన మోర్ఛ రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ జూన్ 15, 1975 ప్రజాస్వామ్యానికి పాతరేసి, నియంతృత్వం రాజ్యమేలిన రోజు దేశమంతా అధికార దాహమనే చీకటితో నిండిన రోజు స్వాతంత్య్రాన్ని కాలరాసి, రాక్షసత్వం రాజ్యమేలిన రోజు వ్యక్తి స్వేచ్ఛకు సమాధి కట్టి రాజ్యాంగాన్ని పరిహసించిన రోజు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధించిన “ఎమర్జెన్సీ” భారత దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిల్చిన దుర్దినం అని, ఎమర్జెన్సీ ఎత్తివేయుటకు పాటుపడి, రాజ్యాంగ విలువలను కాపాడుటకు జైళ్లలో మగ్గిన ఎందరో మహనీయుల సేవలను స్మరించుకుంటూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడదాం అని పిలుపునిచ్చారు. అనంతరం ఎమర్జెన్సీ కాలంలో ఉద్యమంలో పాల్గొన్న రంజిత్ మోహన్, రాజిరెడ్డి గార్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షులు అరుణా తార, బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైలా కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నాయకులు వేణు , రవీందర్, లింగారావు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 27: కాంగ్రెస్ విధించిన ఎమెర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయానికి – 50 సంవత్సరాలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నాడు జరిగిన ఆక్రందనల దృశ్యమాలిక ఎగ్జిబీషన్ నిర్వహించి అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన కామారెడ్డి జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ గ్రహణం స్వాతంత్య్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయం అని, ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించిన తీరు అత్యంత దౌర్భాగ్యం అని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ 21 నెలల పాటు సాగిన నియంతృత్వ, నిరంకుశ ప్రభుత్వ నిర్బంధాలను ఎదిరించి ప్రజాస్వామ్య పరిరక్షణకై పాటుపడిన వీరులందరికీ జోహార్లు అని అన్నారు. దేశంలో ఇందిరాగాంధీ నియంత పాలనలో విధించిన ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు పూర్తి అయ్యాయనీ అన్నారు.
అతిథిగా విచ్చేసిన బీజేపీ గిరిజన మోర్ఛ రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ జూన్ 15, 1975 ప్రజాస్వామ్యానికి పాతరేసి, నియంతృత్వం రాజ్యమేలిన రోజు దేశమంతా అధికార దాహమనే చీకటితో నిండిన రోజు స్వాతంత్య్రాన్ని కాలరాసి, రాక్షసత్వం రాజ్యమేలిన రోజు వ్యక్తి స్వేచ్ఛకు సమాధి కట్టి రాజ్యాంగాన్ని పరిహసించిన రోజు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధించిన “ఎమర్జెన్సీ” భారత దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిల్చిన దుర్దినం అని, ఎమర్జెన్సీ ఎత్తివేయుటకు పాటుపడి, రాజ్యాంగ విలువలను కాపాడుటకు జైళ్లలో మగ్గిన ఎందరో మహనీయుల సేవలను స్మరించుకుంటూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడదాం అని పిలుపునిచ్చారు.
అనంతరం ఎమర్జెన్సీ కాలంలో ఉద్యమంలో పాల్గొన్న రంజిత్ మోహన్, రాజిరెడ్డి గార్లను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షులు అరుణా తార, బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైలా కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నాయకులు వేణు , రవీందర్, లింగారావు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.