పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
డిఆర్వో యం. విశ్వేశ్వర నాయుడు
కడప, జూలై 15(భారత శక్తి) : జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఏపిపిఎస్సి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి యం. విశ్వేశ్వర నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లో డిఆర్వో గారి ఛాంబర్లో.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే క్రింద తెలిపిన నోటిఫికేషన్ సంబందించిన పరీక్షల నిర్వహణపై డిఆర్వో యం. విశ్వేశ్వర నాయుడు ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారులైన పర్యవేక్షకులు శ్రీమతి యాన్. అంజమ్మ(సెక్షన్ ఆఫీసర్) మరియు పి. పద్మ ప్రియ(సెక్షన్ ఆఫీసర్)లతో కలిసి పరీక్షల విధులు కేటాయించిన 07 మంది లైజెన్ ఆఫీసర్లు, 07 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో మరియు పోలీస్, మెడికల్, విద్యుత్ శాఖదికరులతో కలిసి సమావేశం నిర్వహించారు.
నోటిఫికేషన్ సంఖ్య, విడుదల తేదీ, పోస్టుల వివరాలు క్రింద తెలిపిన ప్రకారం..
1. 13/2013, Dt. 21.12.2023 : Lecture in Government Polytechnic Colleges (Engineering & Non-Engineering) in A.P Technical Education Service
2. 16/2023, Dt. 28.12.2023 : Junior Lecture in Government Junior Colleges in A.P Intermediate Education Service
3. 17/2023, Dt. 30.12.2023 : Lectures in Government Degree Colleges in A.P Collegiate Education Service
ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో పై నోటిఫికేషన్ సంబందించిన పోస్టుల భర్తీ కోసం.. ఈ నెల 15 మరియు 23వ తేది వరకు ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 02.30 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ల, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా జరిగేలా చూడాలని సూచించారు. పోలీసు శాఖ ప్రతి సెంటర్లో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు, వారి వెంట వచ్చే వారికి ఎలాంటి కొరత లేకుండా ఆయా పరీక్ష కేంద్రాల యాజమాన్యాలు అన్ని వసతులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.