ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మార్వో పవన్ చంద్రకు వినతిపత్రం.
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 28: నిర్మల్ జిల్లా బాసర మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని మండల తాసిల్దార్.పవన్ చంద్ర కు వినతి పత్రాన్ని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోర్వ శ్యామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు కొత్తగా ఆధార్‌కార్డు దరఖాస్తు చేయాలన్నా,కొత్త పెళ్లి చేసుకుని వచ్చినవారి చిరునామా మార్పుతో పాటు,ఆధార్‌కార్డులో తప్పొప్పుల సవరణకు నిజామాబాద్ జిల్లాలోని నవీపేట,రేంజర్ ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.తీరా అక్కడకి వెళ్లాక ఇంటర్నెట్,ఇతర సాంకేతిక సమస్యలతో పనులు జరగడం లేదని పేర్కొన్నారు, అక్కడి పట్టణ ప్రజలతో పాటు,ఇతర మండలాల ప్రజలు కూడా రావడంతో రద్దీ ఉండడంతో పాటు దూర ప్రయాణం వల్ల డబ్బులు వృధా అవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాగరాజు ,వాజిద్ తదితరులు పాల్గొన్నారు.
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 28: నిర్మల్ జిల్లా బాసర మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని మండల తాసిల్దార్.పవన్ చంద్ర కు వినతి పత్రాన్ని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోర్వ శ్యామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చిన్నారులకు కొత్తగా ఆధార్‌కార్డు దరఖాస్తు చేయాలన్నా,కొత్త పెళ్లి చేసుకుని వచ్చినవారి చిరునామా మార్పుతో పాటు,ఆధార్‌కార్డులో తప్పొప్పుల సవరణకు నిజామాబాద్ జిల్లాలోని నవీపేట,రేంజర్ ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.తీరా అక్కడకి వెళ్లాక ఇంటర్నెట్,ఇతర సాంకేతిక సమస్యలతో పనులు జరగడం లేదని పేర్కొన్నారు, అక్కడి పట్టణ ప్రజలతో పాటు,ఇతర మండలాల ప్రజలు కూడా రావడంతో రద్దీ ఉండడంతో పాటు దూర ప్రయాణం వల్ల డబ్బులు వృధా అవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాగరాజు ,వాజిద్ తదితరులు పాల్గొన్నారు.