సాంకేతిక కాలేజీలో పే స్కేల్స్ లేవు..!
హైదరాబాద్, భారత శక్తి ప్రతినిధి, జూన్ 27: పే స్కేల్స్ చెల్లిస్తున్నారా..? లేదా అని పోల్ పెడితే అందులో చాలా మంది ఫ్యాకల్టీ పాల్గొన్నారు. అందులో చాలామంది పే స్కేల్స్ చెల్లించడం లేదని తెలియజేశారు. దాదాపు 95.945శాతం మంది అధ్యాపకులు వేతన సంఘ జీతాలు చెల్లించడం లేదని, ఇచ్చే జీతాలు కూడా సరిగ్గా చెల్లించడం లేదని వాపోతున్నారు. టి.జీ.ఏ.ఎఫ్.ఆర్.సి. జీత భత్యాలు పెరిగాయి. జీతాలు ఖర్చు అధికంగా పెరిగాయి అని మా కాలేజ్ ల ఫీజులు పెంచండి అని తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యార్థుల భవిష్యత్ మీద గుది బండలాగా లక్షల రూపాయలు ఫీజులు పెంచుకోవాలని గత తొమ్మిది ఏళ్లుగా చూస్తున్నారు. ఫారం 16 అండ్ 26ఏఎస్ లో ఏముంది..? అంతా తప్పుల తడకే.. ఒక్కరి జీతం కూడా వేతన సంఘ జీతాలు లేవు,అలాంటిది ఫారం 16 ,26 ఏఎస్ లో చూపించారు. ఒక కాలేజ్ లో ఒక అధ్యాపకుడు జీతం రూ. 35000/- కానీ అతని అకౌంట్లో ప్రతి నెల 80,000/- రూపాయలు జమ అయినట్టు చూపిస్తున్నారు..అంటే 45000/- రూపాయలు పక్కదారి పట్టాయి అన్న మాట.. కాగితం, పత్రం లేకుండానే డొనేషన్లకి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాంటి కాలేజ్ లు ఫీజు లక్షల్లో, డొనేషన్ 5-20 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కొత్త కోర్సులకు బారిగా ఖర్చు అవుతుంది అని చెప్తున్న వారు అసలు వాటికి సరైన అధ్యాపకులు లేకపోవడం గమనార్హం.
హైదరాబాద్, భారత శక్తి ప్రతినిధి, జూన్ 27:
పే స్కేల్స్ చెల్లిస్తున్నారా..? లేదా అని పోల్ పెడితే అందులో చాలా మంది ఫ్యాకల్టీ పాల్గొన్నారు. అందులో చాలామంది పే స్కేల్స్ చెల్లించడం లేదని తెలియజేశారు. దాదాపు 95.945శాతం మంది అధ్యాపకులు వేతన సంఘ జీతాలు చెల్లించడం లేదని, ఇచ్చే జీతాలు కూడా సరిగ్గా చెల్లించడం లేదని వాపోతున్నారు. టి.జీ.ఏ.ఎఫ్.ఆర్.సి. జీత భత్యాలు పెరిగాయి. జీతాలు ఖర్చు అధికంగా పెరిగాయి అని మా కాలేజ్ ల ఫీజులు పెంచండి అని తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యార్థుల భవిష్యత్ మీద గుది బండలాగా లక్షల రూపాయలు ఫీజులు పెంచుకోవాలని గత తొమ్మిది ఏళ్లుగా చూస్తున్నారు.
ఫారం 16 అండ్ 26ఏఎస్ లో ఏముంది..? అంతా తప్పుల తడకే.. ఒక్కరి జీతం కూడా వేతన సంఘ జీతాలు లేవు,అలాంటిది ఫారం 16 ,26 ఏఎస్ లో చూపించారు. ఒక కాలేజ్ లో ఒక అధ్యాపకుడు జీతం రూ. 35000/- కానీ అతని అకౌంట్లో ప్రతి నెల 80,000/- రూపాయలు జమ అయినట్టు చూపిస్తున్నారు..అంటే 45000/- రూపాయలు పక్కదారి పట్టాయి అన్న మాట.. కాగితం, పత్రం లేకుండానే డొనేషన్లకి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాంటి కాలేజ్ లు ఫీజు లక్షల్లో, డొనేషన్ 5-20 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కొత్త కోర్సులకు బారిగా ఖర్చు అవుతుంది అని చెప్తున్న వారు అసలు వాటికి సరైన అధ్యాపకులు లేకపోవడం గమనార్హం.