దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
రామచంద్రాపురం, జూన్ 26(భారత శక్తి): దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణానికి పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఒక లక్ష 50 వేల రూపాయల సొంత నిధులను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్ పరిధిలో సొంత నిధులతో ఆలయాలు నిర్మించడంతోపాటు ప్రతి ఒక్కరిలో పరమత సహనం పెంపొందించేలా మసీదులు, ఆశిర్ఖానాలు, చర్చీలు నిర్మించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నగేష్ యాదవ్, ఆలయ కమిటీ ప్రతినిధి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రాపురం, జూన్ 26(భారత శక్తి):
దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణానికి పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఒక లక్ష 50 వేల రూపాయల సొంత నిధులను విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్ పరిధిలో సొంత నిధులతో ఆలయాలు నిర్మించడంతోపాటు ప్రతి ఒక్కరిలో పరమత సహనం పెంపొందించేలా మసీదులు, ఆశిర్ఖానాలు, చర్చీలు నిర్మించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నగేష్ యాదవ్, ఆలయ కమిటీ ప్రతినిధి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.