మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి : బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్

జూన్ 26 (భారత శక్తి): మందమర్రిలో మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని బెల్లంపల్లి ఏసీపీ శ్రీ రవి కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, మందమర్రి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని ఏసీపీ రవి కుమార్ ప్రారంభించారు. మందమర్రి సింగరేణి గ్రౌండ్ నుండి మార్కెట్ మీదుగా సాగిన ఈ భారీ ర్యాలీలో సింగరేణి మందమర్రి జీఎం దేవేందర్, ఇతర సింగరేణి అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకండి వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలలో చైతన్యం నింపారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేసి, “యాంటీ డ్రగ్ సోల్జర్స్”గా సంతకాలు చేశారు.ఈ సందర్భంగా ఏసీపీ శ్రీ రవి కుమార్ మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. అలాంటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై పురోగతికి, ఉజ్వల భవిష్యత్తుకు స్వయంగా అవరోధాలు సృష్టించుకోవద్దు. సమాజం నుండి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. పోలీస్ శాఖ గంజాయి వంటి మత్తుపదార్థాల అమ్మకం వాడకంపై కఠినంగా వ్యవహరిస్తుంది, అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఎస్ఐలు, సింగరేణి పర్సనల్ మేనేజర్, ఎస్ఓ టూ జీఎం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి : బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్

జూన్ 26 (భారత శక్తి): మందమర్రిలో మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని బెల్లంపల్లి ఏసీపీ శ్రీ రవి కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, మందమర్రి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని ఏసీపీ రవి కుమార్ ప్రారంభించారు.
మందమర్రి సింగరేణి గ్రౌండ్ నుండి మార్కెట్ మీదుగా సాగిన ఈ భారీ ర్యాలీలో సింగరేణి మందమర్రి జీఎం దేవేందర్, ఇతర సింగరేణి అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకండి వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలలో చైతన్యం నింపారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేసి, “యాంటీ డ్రగ్ సోల్జర్స్”గా సంతకాలు చేశారు.ఈ సందర్భంగా ఏసీపీ శ్రీ రవి కుమార్ మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. అలాంటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై పురోగతికి, ఉజ్వల భవిష్యత్తుకు స్వయంగా అవరోధాలు సృష్టించుకోవద్దు. సమాజం నుండి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. పోలీస్ శాఖ గంజాయి వంటి మత్తుపదార్థాల అమ్మకం వాడకంపై కఠినంగా వ్యవహరిస్తుంది, అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఎస్ఐలు, సింగరేణి పర్సనల్ మేనేజర్, ఎస్ఓ టూ జీఎం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి