ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
ములుగు జిల్లా ప్రతినిధి, జులై 15 (భారత శక్తి) : ఆదివాసీలను అణిచివేసే కుట్రలో భాగంగా అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రభుత్వ విధానాలను ఖండించాలని ఏఐకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రసాదన్న అన్నారు. 2023 అటవీ సంరక్షణ సవరణ చట్టం రద్దుకై పోరాడాలన్నారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ తెగ లను అణచివేసి అక్కడి ఖనిజ సంపదను లూటీ చేయడానికి ప్రకృతి వనరులను నాశనం చేసి దేశ పర్యావరణాన్ని దెబ్బ తీసేందుకు కుట్రలో భాగంగా చట్టాలకు సవరణ చేశారని ఆరోపించారు.
సోమ వారం ములుగులో జరిగిన తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా మహాసభలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. లోక్ సభలో 2023లో ఆమోదించిన అటవీ సంరక్షణ సవరణ, జీవవైవిధ్య సవరణ చట్టాలు కుట్రలో భాగమేనన్నారు. దళారుల లాభాల కోసం మన ప్రకృతిని, వనరులను, పర్యావ రణాన్ని నాశనం చేయడానికి పూను కున్నారని తెలిపారు. ఆదివాసీలను అడవుల నుంచి గెంటివేసేందుకు సాగుతున్న అన్ని రకాల కుట్రలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ తెగలు, కార్మిక రైతాంగ, ప్రజాతంత్ర శక్తులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్న మైందన్నారు.
అనంతరం తెలంగాణ రైతు కూలీ సంఘం ములుగు జిల్లా నూతన కమిటీని మహా సభల సందర్భంగా ఎన్ను కున్నారు. జిల్లా అధ్యక్షు డిగా బానోతు నర్సింహా, ప్రధాన కార్యదర్శిగా పల్లె బోయిన స్వామితో పాటు మరో పదిహేను మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కెమిడి ఉప్పలయ్య, నాయకులు పల్లె బోయిన స్వామి, ఈర్ల పైడి, బోర్రా ఆనంద్, బామండ్ల రవిందర్, నాంపల్లి స్వామి, సందీప్ తదిత రులు పాల్గొన్నారు.