ములుగు పిఎసిఎస్ కు ఉత్తమ అవార్డు
అవార్డు అందుకున్న చైర్మన్ బొక్క సత్తిరెడ్డి
On
ములుగు జిల్లా ప్రతినిధి, జులై 15 (భారత శక్తి) : హైదరాబాద్ లో జరిగిన నాబార్డ్ సంస్థ సదస్సులో ములుగు పిఎసిఎస్ సొసైటీకి ఉత్తమ అవార్డుకు ఎంపిక కాగా మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్, టెస్కా చైర్మన్ మార్నేని రవీందర్ రావు చేతుల మీదుగా ములుగు పిఎసిఎస్ చైర్మన్ బొక్క సత్తి రెడ్డి ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనంకొండ,ములుగు పిఎసిఎస్ సొసైటీలు ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యాయి. అందులో ములుగు పిఎసిఎస్ సొసైటీకి ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, మంత్రి సీతక్క ఆశీస్సులు ఉండడం వల్లనే ఈ అవార్డు అందుకోవడం జరిగిందని, మాతోటి పిఎసిఎస్ పాలకవర్గానికి, వైస్ చైర్మన్,డైరెక్టర్లకు, తమకు సహకరించిన ములుగు మండల పరిధిలోని రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసారు.
About The Author
16 Jul 2025
Latest News
15 Jul 2025 21:14:17
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...