ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు.

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 26: నిర్మల్ జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ సమర్థంగా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర గనుల, కార్మిక, ఉపాధి, పరిశ్రమల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పారదర్శకంగా అమలు చేయాలనీ ఆదేశించారు. ఆయా శాఖల్లో సిబ్బంది కొరత ఉన్నచోట తాత్కాలిక భర్తీకి కలెక్టర్లు చర్యలు తీసుకోవచ్చని సూచించారు. భూభారతి చట్టం అమలుతో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించినట్టు చెప్పారు. పాత ధరణి చట్టంతో భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి అధికారులంతా కృషి చేయాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, అటవీ, రహదారులు తదితర శాఖల పనితీరును మంత్రులు సమీక్షించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆరు హామీల అమలు వివరాలను కలెక్టర్ వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 1.83 లక్షల మంది రైతులకు రూ.268.75 కోట్లు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. రూ.2 లక్షల వరకు రైతు రుణాలు ఒకేసారి మాఫీ చేయడంతో నిర్మల్ జిల్లాలో 71,565 మంది రైతుల రుణంగా రూ.658.61 కోట్లు మాఫీ జరిగిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్ టి సి బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1.54 కోటి మహిళలు ప్రయాణించగా, వీటికి రూ.63.45 కోట్లు మహిళలకు ప్రయోజనం చేకూరిందని తెలిపారు. అలాగే గ్యాస్ సిలిండర్‌ను రూ.500కి అందిస్తూ 1.14 లక్షల మందికి లబ్ధి చేకూరిందని వివరించారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీలో సహాయ పరిమితిని 5లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం తో నిర్మల్ జిల్లాలో 7523 మందికి రూ.16.85 కోట్లు విలువైన వైద్య సేవలు అందాయన్నారు. గృహజ్యోతి పథకం కింద ఇంటికి ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తూ 1.02 లక్షల కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేయడంతో రూ.38.62 కోట్లు సబ్సిడీగా అందించడం జరిగిందన్నారు. నిర్మల్ జిల్లా అభివృద్ధి మార్గంలో నిరంతరంగా ముందుకు సాగుతోందని, ప్రతి ఒక్క పథకం నిరుపేద వర్గాలకు సమర్థంగా చేరాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు సమీక్షకు హాజరైన మంత్రులకు జిల్లా కలెక్టర్ పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఎమ్మెల్సీలు దండే విఠల్, శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, వినోద్, పాయల్ శంకర్, కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, వెంకటేష్ దోత్రే, కుమార్ దీపక్, ఎస్పీలు జానకి షర్మిల, అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు.

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 26: నిర్మల్ జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ సమర్థంగా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర గనుల, కార్మిక, ఉపాధి, పరిశ్రమల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పారదర్శకంగా అమలు చేయాలనీ ఆదేశించారు. ఆయా శాఖల్లో సిబ్బంది కొరత ఉన్నచోట తాత్కాలిక భర్తీకి కలెక్టర్లు చర్యలు తీసుకోవచ్చని సూచించారు. భూభారతి చట్టం అమలుతో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించినట్టు చెప్పారు. పాత ధరణి చట్టంతో భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి అధికారులంతా కృషి చేయాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, అటవీ, రహదారులు తదితర శాఖల పనితీరును మంత్రులు సమీక్షించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆరు హామీల అమలు వివరాలను కలెక్టర్ వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 1.83 లక్షల మంది రైతులకు రూ.268.75 కోట్లు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. రూ.2 లక్షల వరకు రైతు రుణాలు ఒకేసారి మాఫీ చేయడంతో నిర్మల్ జిల్లాలో 71,565 మంది రైతుల రుణంగా రూ.658.61 కోట్లు మాఫీ జరిగిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్ టి సి బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1.54 కోటి మహిళలు ప్రయాణించగా, వీటికి రూ.63.45 కోట్లు మహిళలకు ప్రయోజనం చేకూరిందని తెలిపారు. అలాగే గ్యాస్ సిలిండర్‌ను రూ.500కి అందిస్తూ 1.14 లక్షల మందికి లబ్ధి చేకూరిందని వివరించారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీలో సహాయ పరిమితిని 5లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం తో నిర్మల్ జిల్లాలో 7523 మందికి రూ.16.85 కోట్లు విలువైన వైద్య సేవలు అందాయన్నారు. గృహజ్యోతి పథకం కింద ఇంటికి ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తూ 1.02 లక్షల కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేయడంతో రూ.38.62 కోట్లు సబ్సిడీగా అందించడం జరిగిందన్నారు. నిర్మల్ జిల్లా అభివృద్ధి మార్గంలో నిరంతరంగా ముందుకు సాగుతోందని, ప్రతి ఒక్క పథకం నిరుపేద వర్గాలకు సమర్థంగా చేరాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు
సమీక్షకు హాజరైన మంత్రులకు జిల్లా కలెక్టర్ పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.
ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఎమ్మెల్సీలు దండే విఠల్, శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, వినోద్, పాయల్ శంకర్, కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, వెంకటేష్ దోత్రే, కుమార్ దీపక్, ఎస్పీలు జానకి షర్మిల, అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి