సంగారెడ్డిలో ఘనంగా జగన్నాథ రథయాత్ర
సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, జూన్ 27: పూరి జగన్నాధుని దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే తనయుడు చింత సాయినాథ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగన్నాథ్ రథయాత్ర ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ నుంచి ఊరేగింపు ప్రారంభం అయ్యింది. పూరి జగన్నాధుని రథయాత్రను అందంగా అలంకరించి, భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ ఆనందోత్సవాల నడుమ రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నేటి యువతరానికి ఈలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని చింత సాయినాథ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, నాగరాజ్ గౌడ్ , లాడే మల్లేశం, విష్ణు, చక్రపాణి తదితరులు ఉన్నారు.
సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, జూన్ 27:
పూరి జగన్నాధుని దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే తనయుడు చింత సాయినాథ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగన్నాథ్ రథయాత్ర ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ నుంచి ఊరేగింపు ప్రారంభం అయ్యింది. పూరి జగన్నాధుని రథయాత్రను అందంగా అలంకరించి, భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ ఆనందోత్సవాల నడుమ రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నేటి యువతరానికి ఈలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని చింత సాయినాథ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, నాగరాజ్ గౌడ్ , లాడే మల్లేశం, విష్ణు, చక్రపాణి తదితరులు ఉన్నారు.