మత్తు పదార్థాలకు ఎవరు బానిస కావొద్దు: మంత్రి సీతక్క.

ములుగు జిల్లా ప్రతినిధి, జూన్ 26 (భారత శక్తి) : యువతి యువకులు మత్తు పదార్థాలను వాడకుండా అన్నిచోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని, మత్తు పదార్థాలకు ఎవరు బానిస కావద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానం లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజాన్ని డ్రగ్స్ భూతంలా పట్టి పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో కొందరు అక్రమార్కులు వ్యాపారాత్మక ధోరణిలో పసి పిల్లలకు చాకోలెట్స్ రూపంలో డ్రగ్స్ ను అలవాటు చేయించి ఆ మత్తులోకి లాగేస్తుండటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. దీన్ని సవాల్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిoచడం జరుగుతుందని అన్నారు. యువత డ్రగ్స్ కి అలవాటు కావడం వలన వారి నిండు భవిష్యత్తు చీకటిలోకి నెట్టివేయబడుతుందని అన్నారు. రాష్ట్రం లో కానీ, దేశంలో కానీ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల పై కూడా అత్యంత క్రూరంగా జరుగుతున్న లైంగిక దాడుల్లో డ్రగ్స్ తీసుకున్నవారే అధికంగా ఉంటున్నారని అన్నారు. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే చాలా కష్టమైన విషయం కాబట్టి, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందని, దీనిని విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతి యువకులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలు వాడకంలో దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వాడకం వలన జరిగే అనారోగ్య సమస్యలపై యువత అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. మత్తు పదార్థాల వలన జరిగే నష్టాలపై సంబంధిత శాఖల అధికారులు పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మంత్రి అన్నారు. : జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అనే ఆలోచనతో యువత ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ పరిస్థితులను అవగాహన చేసుకుని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి జీవితాన్ని కొనసాగించడానికి చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు. యువతే దేశ భవిష్యత్తు అని, మీ తల్లి తండ్రులు మీ పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారని, ఉన్నత చదువులు చదివి ఉన్నతబుద్యోగాలు సాధించి కుటుంబానికి, ఈ దేశానికి గొప్ప ఆస్తిగా ఎదగాలని సూచించారు : జిల్లా ఎస్ పి శబరీష్ మాట్లాడుతూ అందరం కలిసి డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలని సందేశం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. డ్రగ్స్ అంటే గంజాయి మాత్రమే కాదని సిగరెట్, గుట్కా, జర్దా అది ఏ రూపంలో ఉన్నా డ్రగ్స్ గానే భావించాలని తెలిపారు. కంట్రోల్ గా డ్రగ్స్ తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు కూడా వాటికి అలవాటైతే వారే డ్రగ్స్ కంట్రోల్ లోకి వెళ్తారని అన్నారు. ఒకసారి డ్రగ్స్ కి అలవాటు అయితే వాటిని కొనుక్కోనే కోసం దొంగతనాలకు అలవాటు అయ్యే పరిస్థితి వస్తుందని అన్నారు. చదువుల్లో టాపర్ గా ఉండి ఎంతో గొప్ప స్థానానికి వెళ్తార అని అనుకున్న వాళ్ళు కూడా ఊహించని స్థాయికి దిగజారి పోవడం జరుగుతుందని తెలిపారు. టీచర్లు, తల్లి తండ్రులు తమ పిల్లల చదువులపై దృష్టి పెట్టాలని, వారి క్రమశిక్షణ, ప్రవర్తన లో ఏవిధమైన మార్పులు గమనించినా తగిన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ నిర్మూలనలో పోలీస్ శాఖ చేస్తున్న యజ్ఞం లో భాగస్వామ్యం కావాలని ప్రజలను కోరారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందించారు. అనంతరం మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్ పి ల తో కలిసి జెండా ఊపి ఈ డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీని ప్రారంభించగా జిల్లాలోని వివిధ ప్రాంతలనుండి దాదాపు 15 వందల మంది యువత, విద్యార్థినీ, విద్యార్థులు తంగేడు నుండి డి ఎల్ ఆర్ ఫంకన్ హాల్ వరకు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, అదనపు ఎస్ పి సదానందం, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్, సంబంధిత అధికారులు, యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు ఎవరు బానిస కావొద్దు: మంత్రి సీతక్క.

ములుగు జిల్లా ప్రతినిధి, జూన్ 26 (భారత శక్తి) : యువతి యువకులు మత్తు పదార్థాలను వాడకుండా అన్నిచోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని, మత్తు పదార్థాలకు ఎవరు బానిస కావద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానం లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నేటి సమాజాన్ని డ్రగ్స్ భూతంలా పట్టి పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో కొందరు అక్రమార్కులు వ్యాపారాత్మక ధోరణిలో పసి పిల్లలకు చాకోలెట్స్ రూపంలో డ్రగ్స్ ను అలవాటు చేయించి
ఆ మత్తులోకి లాగేస్తుండటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. దీన్ని సవాల్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిoచడం జరుగుతుందని అన్నారు.

యువత డ్రగ్స్ కి అలవాటు కావడం వలన వారి నిండు భవిష్యత్తు చీకటిలోకి నెట్టివేయబడుతుందని అన్నారు. రాష్ట్రం లో కానీ, దేశంలో కానీ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల పై కూడా అత్యంత క్రూరంగా జరుగుతున్న లైంగిక దాడుల్లో డ్రగ్స్ తీసుకున్నవారే అధికంగా ఉంటున్నారని అన్నారు. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే చాలా కష్టమైన విషయం కాబట్టి, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందని, దీనిని విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
యువతి యువకులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలు వాడకంలో దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వాడకం వలన జరిగే అనారోగ్య సమస్యలపై యువత అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. మత్తు పదార్థాల వలన జరిగే నష్టాలపై సంబంధిత శాఖల అధికారులు పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మంత్రి అన్నారు.
: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అనే ఆలోచనతో యువత ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ పరిస్థితులను అవగాహన చేసుకుని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి జీవితాన్ని కొనసాగించడానికి చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు. యువతే దేశ భవిష్యత్తు అని, మీ తల్లి తండ్రులు మీ పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారని, ఉన్నత చదువులు చదివి ఉన్నతబుద్యోగాలు సాధించి కుటుంబానికి, ఈ దేశానికి గొప్ప ఆస్తిగా ఎదగాలని సూచించారు
: జిల్లా ఎస్ పి శబరీష్ మాట్లాడుతూ
అందరం కలిసి డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలని సందేశం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. డ్రగ్స్ అంటే గంజాయి మాత్రమే కాదని సిగరెట్, గుట్కా, జర్దా అది ఏ రూపంలో ఉన్నా డ్రగ్స్ గానే భావించాలని తెలిపారు. కంట్రోల్ గా డ్రగ్స్ తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు కూడా వాటికి అలవాటైతే వారే డ్రగ్స్ కంట్రోల్ లోకి వెళ్తారని అన్నారు. ఒకసారి డ్రగ్స్ కి అలవాటు అయితే వాటిని కొనుక్కోనే కోసం దొంగతనాలకు అలవాటు అయ్యే పరిస్థితి వస్తుందని అన్నారు. చదువుల్లో టాపర్ గా ఉండి ఎంతో గొప్ప స్థానానికి వెళ్తార అని అనుకున్న వాళ్ళు కూడా ఊహించని స్థాయికి దిగజారి పోవడం జరుగుతుందని తెలిపారు. టీచర్లు, తల్లి తండ్రులు తమ పిల్లల చదువులపై దృష్టి పెట్టాలని, వారి క్రమశిక్షణ, ప్రవర్తన లో ఏవిధమైన మార్పులు గమనించినా తగిన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ నిర్మూలనలో పోలీస్ శాఖ చేస్తున్న యజ్ఞం లో భాగస్వామ్యం కావాలని ప్రజలను కోరారు.

అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందించారు.
అనంతరం మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్ పి ల తో కలిసి జెండా ఊపి ఈ డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీని ప్రారంభించగా జిల్లాలోని వివిధ ప్రాంతలనుండి దాదాపు 15 వందల మంది యువత, విద్యార్థినీ, విద్యార్థులు తంగేడు నుండి డి ఎల్ ఆర్ ఫంకన్ హాల్ వరకు
ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ రెవిన్యూ
సి హెచ్ మహేందర్ జి, అదనపు ఎస్ పి సదానందం, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్,
సంబంధిత అధికారులు, యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి