డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 26: నిర్మల్ జిల్లా లో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ఎస్పీ డా: జి.జానకి షర్మిల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.గంజాయి,మాదక ద్రవ్యాల నిర్మూలనకై పౌరులు, యువత కృషి చేయాలనీ ఎస్పీ పిలుపునిచ్చారు. భావితరాలకు మంచి సమాజాన్ని అందించాలన్న సదుద్దేశ్యంతో జిల్లాలో గత వారం రోజులుగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.మాదకద్రవ్యాల దుర్వినియోగం, వాటి వల్ల కలిగే నష్టాల గురించి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో మరియు కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, స్లోగన్ రైటింగ్, డ్రాయింగ్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగే నష్టాలను గుర్తెరగాలని, మత్తులో జీవితాలకు చిత్తవుతాయని గుర్తించాలని అన్నారు. డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా మారాలి అని,బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులతో కలిసి మానవ హారం కార్యక్రమంలో పాల్గొన్నారు.జిల్లాలో ఎవరైన గంజాయి వంటి ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించిన అక్రమ రవాణా చేసినట్లు తెలిసిన వాటిని ఉక్కు పాదంతో అణచి వేస్తామన్నారు.మిషన్ గాంజా గస్తీ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల జిల్లాలో ఇది వరకు తో పోలిస్తే చాలా గంజాయి కేసులు చాలా తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. ఒకవేళ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏవైనా అనుమానాస్పద కార్యక్రమాలను గమనించినపుడువెంటనే 8712659599 నంబరు కు సమాచారం ఇవ్వాలనీ విజ్ఞప్తి చేశారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతాయని ఎస్పీ తెలియజేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.