రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా పేదలకు ఆర్ధిక తోడ్పాటు
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 28:
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అయినప్పటికీ వాటిని సరిచేసుకుంటూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు ఆర్ధిక తోడ్పాటు అందిస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. ఖమ్మం, కూసుమంచిలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయాల్లో ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ శనివారం జరిగింది.
ఖమ్మం క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దయాకర్ రెడ్డి మాట్లాడుతూ …. రాష్ట్ర ఖజానాలో సరిపడా నిధులు లేకపోయినా అనేక ఇబ్బందులు పడుతూనే ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, భవిష్యత్తులోనూ అమలు చేస్తుందని తెలిపారు. మంత్రి పొంగులేటి హయంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే తాజాగా తిరుమలాయపాలెం మండలానికి మంత్రి చొరవతో నూతన ఐటీఐ కళాశాల (ఏటీసీ సెంటర్) మంజూరైందని వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 72మంది లబ్ధిదారులకు రూ. 21.53లక్షలు, తిరుమలాయపాలెం మండలానికి చెందిన 70మంది లబ్ధిదారులకు రూ. 24.46లక్షలు, కూసుమంచి మండలానికి చెందిన 79మంది లబ్ధిదారులకు రూ.25.02లక్షలు విలువైన చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.