టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్-2025లో ప్రపంచ గుర్తింపు సాధించిన గీతం
సంగారెడ్డి, జూన్ 27 (భారత శక్తి): యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత ర్యాంకింగ్ ఏజెన్సీ ప్రచురించిన ప్రతిష్టాత్మక టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఇంపాక్ట్ ర్యాంకింగ్స్-2025లో గీతం గణనీయమైన ప్రపంచ గుర్తింపును పొందిందని డైరెక్టరేట్ ఆఫ్ అక్రిడిటేషన్, ర్యాంకింగ్ & IQAC గర్వంగా ప్రకటించింది. ఆ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.రాజా ప్రభు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. ఒక ప్రధాన మైలురాయిగా చెప్పుకోదగ్గ, ఐక్యరాజ్య సమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs)లో గీతం ర్యాంకు పొందినట్టు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అతి కొద్ది విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ ప్రత్యేకతను సాధించనట్టు తెలిపారు. స్థిరత్వం, విద్యా నైపుణ్యం, సామాజిక ప్రభావం పట్ల గీతం యొక్క దృఢమైన నిబద్ధతను ఈ విజయం నొక్కి చెబుతోందన్నారు. ఏడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs) సాధనలో, వంద ఉత్తమ ప్రపంచ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గీతం గుర్తింపు పొందడం ఈ ఏడాది ర్యాంకింగ్స్ లో ఒక విశిష్ట విజయంగా పేర్కొన్నారు. సరసమైన, స్వచ్ఛమైన శక్తి (Affordable and Clean Energy) విభాగంలో గీతం 81వ ర్యాంకు సాధించిందని, ఇది సంస్థ ప్రయాణంలో తొలి, అద్భుతమైన ఘనతగా అభివర్ణించారు. గత నాలుగేళ్లుగా ఈ ర్యాంకింగులలో గీతం స్థిరమైన పురోగతిని ప్రదర్శిస్తోందని, 2022లో నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs) విభాగాలలో, 2023లో ఎనిమిది, 2024లో 12, ఈ ఏడాది 17 విభాగాలలో గీతం క్రమాభివృద్ధిని ప్రదర్శించినట్టు డాక్టర్ రాజా ప్రభు వివరించారు. విద్యావేత్తలు, పరిశోధన, సమాజంతో మమేకం కావడంలో స్థిరత్వాన్ని, గీతం యొక్క వ్యూహాత్మక ఏకీకరణను ఈ ఎదుగుదల ప్రతిబింబిస్తోందన్నారు. ఆవిష్కరణ, సామాజిక ఔచిత్యం, నిరంతర అభివృద్ధి ద్వారా అర్థవంతమైన మార్పు వైపు సంస్థను నడిపించడంలో గీతం నాయకత్వం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమిష్టి ప్రయత్నాలకు ఈ గుర్తింపు నిదర్శమని చెప్పారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ డాక్టర్ రాజా ప్రభు హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేశారు. ప్రపంచ ప్రమాణాలను అందుకోవడానికి గీతం కట్టుబడి ఉందని, అన్ని వేదికలలో ఈ గర్వించదగ్గ క్షణాలను పంచుకోవడాన్ని కొనసాగిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సంగారెడ్డి, జూన్ 27 (భారత శక్తి): యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత ర్యాంకింగ్ ఏజెన్సీ ప్రచురించిన ప్రతిష్టాత్మక టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఇంపాక్ట్ ర్యాంకింగ్స్-2025లో గీతం గణనీయమైన ప్రపంచ గుర్తింపును పొందిందని డైరెక్టరేట్ ఆఫ్ అక్రిడిటేషన్, ర్యాంకింగ్ & IQAC గర్వంగా ప్రకటించింది. ఆ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.రాజా ప్రభు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.
ఒక ప్రధాన మైలురాయిగా చెప్పుకోదగ్గ, ఐక్యరాజ్య సమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs)లో గీతం ర్యాంకు పొందినట్టు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అతి కొద్ది విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ ప్రత్యేకతను సాధించనట్టు తెలిపారు. స్థిరత్వం, విద్యా నైపుణ్యం, సామాజిక ప్రభావం పట్ల గీతం యొక్క దృఢమైన నిబద్ధతను ఈ విజయం నొక్కి చెబుతోందన్నారు.
ఏడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs) సాధనలో, వంద ఉత్తమ ప్రపంచ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గీతం గుర్తింపు పొందడం ఈ ఏడాది ర్యాంకింగ్స్ లో ఒక విశిష్ట విజయంగా పేర్కొన్నారు. సరసమైన, స్వచ్ఛమైన శక్తి (Affordable and Clean Energy) విభాగంలో గీతం 81వ ర్యాంకు సాధించిందని, ఇది సంస్థ ప్రయాణంలో తొలి, అద్భుతమైన ఘనతగా అభివర్ణించారు.
గత నాలుగేళ్లుగా ఈ ర్యాంకింగులలో గీతం స్థిరమైన పురోగతిని ప్రదర్శిస్తోందని, 2022లో నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs) విభాగాలలో, 2023లో ఎనిమిది, 2024లో 12, ఈ ఏడాది 17 విభాగాలలో గీతం క్రమాభివృద్ధిని ప్రదర్శించినట్టు డాక్టర్ రాజా ప్రభు వివరించారు.
విద్యావేత్తలు, పరిశోధన, సమాజంతో మమేకం కావడంలో స్థిరత్వాన్ని, గీతం యొక్క వ్యూహాత్మక ఏకీకరణను ఈ ఎదుగుదల ప్రతిబింబిస్తోందన్నారు. ఆవిష్కరణ, సామాజిక ఔచిత్యం, నిరంతర అభివృద్ధి ద్వారా అర్థవంతమైన మార్పు వైపు సంస్థను నడిపించడంలో గీతం నాయకత్వం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమిష్టి ప్రయత్నాలకు ఈ గుర్తింపు నిదర్శమని చెప్పారు.
ఈ మైలురాయిని చేరుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ డాక్టర్ రాజా ప్రభు హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేశారు. ప్రపంచ ప్రమాణాలను అందుకోవడానికి గీతం కట్టుబడి ఉందని, అన్ని వేదికలలో ఈ గర్వించదగ్గ క్షణాలను పంచుకోవడాన్ని కొనసాగిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.